నిత్యానంద దేశంపై అశ్విన్ ఫన్నీ సెటైర్..చూడాల్సిందే సుమీ..!

అమ్మాయిల కిడ్నాప్ సహా పలు  ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మత గురువు నిత్యానంద దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. నిత్యానందపై గుజరాత్ పోలీసులు బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో సదరు స్వామివారు అనూహ్యంగా  ఈక్వెడార్‌లో  తేలారు. అక్కడ ఓ ద్వీపాన్ని కొని, దానికి ‘కైలాస’ అనే ప్రత్యేక దేశంగా నామకరణం చేశాడు. ఈ ద్వీపం ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు దగ్గర్లో ఉంది. అంతేనా ఆ దేశానికి జెండాను, ఎజెండాను కూడా […]

  • Ram Naramaneni
  • Publish Date - 4:12 pm, Thu, 5 December 19
నిత్యానంద దేశంపై అశ్విన్ ఫన్నీ సెటైర్..చూడాల్సిందే సుమీ..!

అమ్మాయిల కిడ్నాప్ సహా పలు  ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మత గురువు నిత్యానంద దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. నిత్యానందపై గుజరాత్ పోలీసులు బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో సదరు స్వామివారు అనూహ్యంగా  ఈక్వెడార్‌లో  తేలారు. అక్కడ ఓ ద్వీపాన్ని కొని, దానికి ‘కైలాస’ అనే ప్రత్యేక దేశంగా నామకరణం చేశాడు. ఈ ద్వీపం ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు దగ్గర్లో ఉంది. అంతేనా ఆ దేశానికి జెండాను, ఎజెండాను కూడా రూపొందించారు. ఇక ప్రభుత్వంతో పాటు రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, కేబినెట్‌ను కూడా ఖరారు చేశారు. ‘కైలాస’ రాజకీయేతర హిందూ దేశమని, తమను ప్రత్యేక దేశంగా గుర్తించాల్సిందిగా త్వరలోనే ఐరాసను కోరనున్నారట నిత్యానంద.

కాగా ఈ విషయంపై భారత క్రికెట్ ఆటగాడు అశ్విన్, నిత్యానందకు తనదైన శైలిలో చురకలంటించాడు. అక్కడికి రావాలంటే వీసా ఎలా పొందాలని ట్విట్టర్ వేదికగా పశ్నించాడు. లేదా వీసా ఆన్ అరైవల్ ఏమైనా ఇవ్వబోతున్నారా అంటూ ఫన్నీగా కౌంటరిచ్చారు. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.