భద్రత కట్టుదిట్టం.. మ్యాచ్‌ను అడ్డగిస్తే కఠిన చర్యలే..

శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే.. భారత్, వెస్టిండీస్ టీ20 సీరీస్‌కు సర్వం సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. తొలి మ్యాచ్‌ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు రానున్న నేపథ్యంలో.. ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఏర్పాట్లు చేశారు. అటు భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. […]

భద్రత కట్టుదిట్టం.. మ్యాచ్‌ను అడ్డగిస్తే కఠిన చర్యలే..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 06, 2019 | 4:48 AM

శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే.. భారత్, వెస్టిండీస్ టీ20 సీరీస్‌కు సర్వం సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. తొలి మ్యాచ్‌ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు రానున్న నేపథ్యంలో.. ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఏర్పాట్లు చేశారు. అటు భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఇక శుక్రవారం “డిసెంబర్ 6” నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

“బ్లాక్‌డే” నేపథ్యంలో నగరవ్యాప్తంగా భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా అసాంఘిక శక్తులు మ్యాచ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 1800 మంది పోలీసులతో మ్యాచ్‌కు బందోబస్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఇక మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన అభిమానుల వాహనాలకు పార్కింగ్‌ సదుపాయం కూడా ఉందని తెలిపారు. సిగరెట్లు, ల్యాప్‌టాప్‌లు, హెల్మెట్‌లు, అగ్గిపెట్టెలు, పవర్ బ్యాంక్స్, ఆహార పదార్థాలు స్టేడియం లోనికి అనుమతించేది లేదని తెలిపారు. కేవలం జాతీయ జెండా తప్ప.. మరే ఇతర జెండాలూ స్టేడియంలోకి అనుమతించమని పేర్కొన్నారు. ఇక మహిళల రక్షణ కోసం “షీ టీం” బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కాగా, హైదరాబాద్ మెట్రో కూడా.. కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకులకు ఇబ్బందులు తలెత్తకుండా.. మెట్రో ట్రైన్ సర్వీసులను పొడిగించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా.. శుక్రవారం అర్థరాత్రి 12 గంటల వరకూ మెట్రో అందుబాటులో ఉండనున్నట్లు హెచ్‌ఎంఆర్ ప్రకటించింది.