సిటీ రోడ్లను తవ్వే అధికారం ఇక ఒక్క సంస్థదే.. కెటీఆర్ డేరింగ్ డెసిషన్
వేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని రోడ్లను వాహనాలు, పాదచారులు సౌకర్యంగా ప్రయాణించేందుకు అనువుగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత ప్రమాణాలతో అభివృద్ది చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావు తెలిపారు. రోజురోజుకూ ఇబ్బందికరంగా మారుతున్న ట్రాఫిక్ వ్యవస్థను క్రమబద్దీకరించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. గురువారం బుద్దభవన్‌లో పోలీసు, జిహెచ్ఎంసి ఉన్నతాధికారులతో కెటీఆర్ సమావేశమయ్యారు. ఎలక్ట్రిసిటి, టి.ఎస్.ఐ.ఐ.సి, జలమండలి అధికారులను కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ […]
వేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని రోడ్లను వాహనాలు, పాదచారులు సౌకర్యంగా ప్రయాణించేందుకు అనువుగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత ప్రమాణాలతో అభివృద్ది చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావు తెలిపారు. రోజురోజుకూ ఇబ్బందికరంగా మారుతున్న ట్రాఫిక్ వ్యవస్థను క్రమబద్దీకరించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.
గురువారం బుద్దభవన్‌లో పోలీసు, జిహెచ్ఎంసి ఉన్నతాధికారులతో కెటీఆర్ సమావేశమయ్యారు. ఎలక్ట్రిసిటి, టి.ఎస్.ఐ.ఐ.సి, జలమండలి అధికారులను కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థకు ఆదరణ ఎక్కువగా ఉన్నదని తెలిపారు. వచ్చే 5 సంవత్సరాలలో వాహనాల సంఖ్య 73 లక్షల నుండి కోటి 20 లక్షలకు పెరిగే అవకాశం వుందన్నారు.
మెట్రో రైలు, ఎం.ఎం.టి.ఎస్ మార్గాలు, స్టేషన్లు, ప్రధాన రహదారులకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లు, లైనింగ్, సైకిల్ వేలు, గ్రీనరీలను అభివృద్ది చేయనున్నట్లు మంత్రి చెప్పారు. పార్కింగ్ ఏరియాలను కూడా ఎక్కువగా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఖాళీ ప్లాట్లను పార్కింగ్ ప్రదేశాలుగా ఏర్పాటు చేసేందుకు ప్రైవేట్ యజమానుల అంగీకారాన్ని తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ స్థలాల్లో పార్కింగ్‌తో సంబంధిత స్థలాల యజమానులకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు.
రోడ్ల అభివృద్దిలో భాగంగా 709 కిలోమీటర్ల ప్రధాన రహదారులను సి.ఆర్.ఎం.పి కింద తీసుకువచ్చినట్లు తెలిపారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి సి.ఆర్.ఎం.పి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్లను కెటీఆర్ ఆదేశించారు. ఐదు సంవత్సరాల పాటు పూర్తిగా ఆయా రోడ్లను నిర్వహించే బాధ్యత సంబంధిత ఏజెన్సీలదేనని స్పష్టం చేశారు. పైప్‌లైన్లు, కేబుళ్ల, డ్రైనేజీ తవ్వకాలు, మరమ్మతులను సంబంధిత ఏజెన్సీల ద్వారానే చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు.
తవ్వకాలు, మరమ్మతులతో పాటు పునరుద్దరణ పనిని కూడా సి.ఆర్.ఎం.పి ఏజెన్సీనే చేస్తోందని తెలిపారు. ఏజెన్సీలు చేపట్టే పనులకు ప్రభుత్వం, జిహెచ్ఎంసి, పోలీసు యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. ట్రాఫిక్ వ్యవస్థను సమన్వయం చేసేందుకు జిహెచ్ఎంసి పరిధిలో ప్రత్యేక ట్రాఫిక్ కమిషనరేట్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కమర్షియల్ ఏరియాలలో ఉన్న సెట్‌బ్యాక్ స్థలాన్ని కూడా ఫుట్‌వేలకు వినియోగించనున్నట్లు తెలిపారు.
మహిళల భద్రతపై విస్తృత చర్చ
మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి కె.టి.ఆర్ సూచించారు. నగరంలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టోల్ ఫ్రీ నెంబర్ 100కు విస్తృతంగా ప్రచారం కల్పించాలని తెలిపారు. వైన్స్ షాపులు, దాని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మద్యం సేవించేవారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. సంబంధిత వైన్స్ షాపులను మూసివేయించాలని తెలిపారు. పార్కులు, ఖాళీ స్థలాలు అసాంఘిక శక్తుల అడ్డాలుగా మారరాదని తెలిపారు. నగరంలో 4 లక్షల ఎల్.ఇ.డి లైట్లు ఉన్నాయని, అన్ని రోడ్లపై లైటింగ్‌ను పెంచుటకు అదనంగా మరిన్ని ఎల్.ఇ.డి లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిహెచ్ఎంసి ద్వారా మహిళల భద్రతకై చేపట్టిన అవగాహన సదస్సులు, పబ్లిసిటీ కార్యక్రమాలను అభినందించారు.