టాలీవుడ్‌లో మరో విషాదం..ప్రముఖ నిర్మాత మృతి
తెలుగు ఇండష్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సీనియర్ రంగస్థల, సినీ నటులు శివప్రసాద్ మరణవార్త నుంచి కోలుకునేలోపే ఇటీవల ఓ నిర్మాత రోడ్డు ప్రమాదంలో తనువు చాలించారు. తాజాగా శ్రీనాథ్ మూవీస్, శ్రీనాథ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఆలపాటి రంగారావు బుధవారం అర్థరాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన్ను ఆనారోగ్య సమస్యలు వెంటాడుతుండటంతో ఇంట్లోనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ గత రాత్రి పరిస్థితి విషమించి కన్నుమూశారు. 88 సంవత్సరాల వయసున్న రంగారావు… న్యాయనికి శిక్ష, కాయ్ […]
తెలుగు ఇండష్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సీనియర్ రంగస్థల, సినీ నటులు శివప్రసాద్ మరణవార్త నుంచి కోలుకునేలోపే ఇటీవల ఓ నిర్మాత రోడ్డు ప్రమాదంలో తనువు చాలించారు. తాజాగా శ్రీనాథ్ మూవీస్, శ్రీనాథ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఆలపాటి రంగారావు బుధవారం అర్థరాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన్ను ఆనారోగ్య సమస్యలు వెంటాడుతుండటంతో ఇంట్లోనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ గత రాత్రి పరిస్థితి విషమించి కన్నుమూశారు. 88 సంవత్సరాల వయసున్న రంగారావు… న్యాయనికి శిక్ష, కాయ్ రాజా కాయ్, చిన్నారి స్నేహం, రాజకుమార్, నాకు పెళ్లాం కావాలి, దోస్తి దుష్మన్(హింది) వంటి చిత్రాలను నిర్మించారు. ఈయనకు కాన్‌ప్రో ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కూడా ఉంది. 70వ దశకంలో ఆయన అగ్ర నిర్మాతగా వెలిగొందారు. ఈ వెటరన్ నిర్మాతకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దీంతో పలువురు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఆలపాటి రంగారావు ఇంటికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు.