కార్తికేయకు షాక్.. ’90 ఎంఎల్’ రిలీజ్ కు అడ్డంకులు!

హీరో కార్తికేయ నటించిన ’90 ఎంఎల్’ సినిమా విడుదలను అడ్డుకుంటామని మద్యపాన నిషేధ పోరాట సమితి సభ్యులు తెలిపారు. మద్యపానం పై సినిమాలు తీసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు పేర్కొన్నారు. రేపు చిత్ర విడుదల సందర్భంగా ఐమాక్స్ థియేటర్ వద్ద ధర్నా చేపడుతామని పిలుపునిచ్చారు. ఇటువంటి చిత్రాల వల్లే యువత పెడదోవపట్టి, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని సమితి సభ్యులు ఆరోపించారు. చిత్రంలో మద్యపానాన్ని ప్రోత్సహించే సన్నివేశాలను తొలగించి, చిత్రం పేరును మార్చాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:02 pm, Thu, 5 December 19
కార్తికేయకు షాక్.. '90 ఎంఎల్' రిలీజ్ కు అడ్డంకులు!

హీరో కార్తికేయ నటించిన ’90 ఎంఎల్’ సినిమా విడుదలను అడ్డుకుంటామని మద్యపాన నిషేధ పోరాట సమితి సభ్యులు తెలిపారు. మద్యపానం పై సినిమాలు తీసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు పేర్కొన్నారు. రేపు చిత్ర విడుదల సందర్భంగా ఐమాక్స్ థియేటర్ వద్ద ధర్నా చేపడుతామని పిలుపునిచ్చారు. ఇటువంటి చిత్రాల వల్లే యువత పెడదోవపట్టి, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని సమితి సభ్యులు ఆరోపించారు. చిత్రంలో మద్యపానాన్ని ప్రోత్సహించే సన్నివేశాలను తొలగించి, చిత్రం పేరును మార్చాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.