ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్.. అప్పుడు వరంగల్.. ఇప్పుడు సైబరాబాద్!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ దిశ హత్య కేసు నిందితులను షాద్‌నగర్‌లో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో.. పోలీసులు వారిని ఎన్‌కౌంటర్ చేశారు. నిందితులైన మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు.. దిశ మరణించిన ప్రదేశంలోనే మృతి చెందటంతో.. దిశకు సరైన న్యాయం జరిగిందని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. అటు దిశ తల్లిదండ్రులు కూడా.. నిందితులకు తగిన శిక్ష పడిందని సంతోషాన్ని వ్యక్తం […]
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ దిశ హత్య కేసు నిందితులను షాద్‌నగర్‌లో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో.. పోలీసులు వారిని ఎన్‌కౌంటర్ చేశారు. నిందితులైన మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు.. దిశ మరణించిన ప్రదేశంలోనే మృతి చెందటంతో.. దిశకు సరైన న్యాయం జరిగిందని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. అటు దిశ తల్లిదండ్రులు కూడా.. నిందితులకు తగిన శిక్ష పడిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వి.. ఆయుధాలు లాక్కునేందుకు నిందితులు ప్రయత్నించిన సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే సీపీ సజ్జనార్.. గతంలో వరంగల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు ఓ యువతిపై యాసిడ్ అటాక్ జరిగింది. ఇక అప్పట్లో దాడి చేసిన నిందితులను వరంగల్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఎన్‌కౌంటర్ చేశారు.ఇప్పుడు దిశ అత్యాచారం కేసులో కూడా నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. ప్రస్తుతం సజ్జనార్ సైబరాబాద్ సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, మహిళలపై దాడులకు పాల్పడితే.. డైరెక్ట్ ఎన్‌కౌంటర్ అని సజ్జనార్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారని చెప్పాలి. అంతేకాకుండా రియల్ పోలీస్ అనిపించుకున్నారు.
వరంగల్ సీన్ చటాన్‌పల్లిలో రిపీట్…
సరిగ్గా పదేళ్ల కిందట 2008 డిసెంబర్ 10న వరంగల్ కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు స్వపణిక, ప్రణీతలపై యాసిడ్ దాడి జరిగింది. అప్పట్లో సజ్జనార్ వరంగల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ యాసిడ్ అటాక్‌లో ముగ్గురు నిందితులైన శాఖమూరి శ్రీనివాస్, బజ్జురి సంజయ్, పోతరాజు హరికృష్ణలను కస్టడీలోకి తీసుకున్న 3 రోజుల అనంతరం వరంగల్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఎన్‌కౌంటర్ చేశారు. వాళ్ళు కూడా సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు కాల్చి చంపారు. అప్పట్లో దేశవ్యాప్తంగా ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు పదేళ్ల తర్వాత డాక్టర్ దిశ హత్యకేసు నిందితులను సైతం ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. ఇక అప్పుడు, ఇప్పుడు ఎన్‌కౌంటర్ క్రెడిట్ ఐపీఎస్ అధికారి విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్దే.. కాగా, సరిగ్గా 10ఏళ్ల తరువాత సేమ్ ఇన్సిడెంట్ రిపీట్ కావడం…. అదీ కూడా రెండూ జరిగినవి డిసెంబర్‌లోనే కావడం గమనార్హం.