AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs WI: కరోనా ఎఫెక్ట్.. భారత్- వెస్టిండీస్ సిరీస్ షెడ్యూల్ లో మార్పులు..

దేశంలో మరోసారి కరోనా కోరలు చాస్తోంది. దీంతో ఇప్పటికే అన్ని రాష్ట్రాలు ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయాయి. కాగా ఈ మహమ్మారి

IND Vs WI: కరోనా ఎఫెక్ట్.. భారత్- వెస్టిండీస్ సిరీస్ షెడ్యూల్ లో మార్పులు..
Basha Shek
|

Updated on: Jan 23, 2022 | 5:55 AM

Share

దేశంలో మరోసారి కరోనా కోరలు చాస్తోంది. దీంతో ఇప్పటికే అన్ని రాష్ట్రాలు ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయాయి. కాగా ఈ మహమ్మారి ప్రభావం ఇప్పుడు రాబోయే భారత్- వెస్టిండీస్ సిరీస్ పై కూడా పడింది. సఫారీ పర్యటన పూర్తయిన వెంటనే ఫిబ్రవరి 6 నుంచి విండీస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ-20 మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జైపూర్, విశాఖపట్నం, కటక్, తిరువనంతపురం, కోల్ కతా, అహ్మదాబాద్ లలో ఈ మ్యాచ్ లు జరగాల్సి ఉంది. అయితే కరోనా ప్రభావంతో ఇప్పుడు కేవలం రెండు నగరాలకే మ్యాచ్ లన్నీ జరగనున్నాయి. మూడు వన్డే మ్యాచ్ లు అహ్మదాబాద్ లో, టీ- 20 మ్యాచ్ లు కోల్ కతాలో జరగనున్నాయి.

బయో సెక్యూరిటీ ముప్పును తగ్గించేందుకు..

కరోనా వల్ల బయో సెక్యూరిటీ ముప్పు తగ్గించడంతో పాటు ఆటగాళ్లు, సిబ్బంది, అధికారులు, బ్రాడ్ కాస్టర్ల ప్రయాణాలను వీలైనంత తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. కాగా విండీస్ బోర్డు కూడా ఈ ప్రతిపాదనలను అంగీకరించింది. ఫిబ్రవరి 6- 20 ల మధ్య ఈ సిరీస్ జరగనుంది.

భారత్ -వెస్టిండీస్ సిరీస్ ఇలా..

ఫిబ్రవరి 6- మొదటి వన్డే – అహ్మదాబాద్

ఫిబ్రవరి 9- రెండో వన్డే-  అహ్మదాబాద్

ఫిబ్రవరి 11- మూడో వన్డే- అహ్మదాబాద్

ఫిబ్రవరి 16- మొదటి టీ- 20- కోల్ కతా

ఫిబ్రవరి 18 – రెండో టీ-20- కోల్ కతా

ఫిబ్రవరి 20 – మూడో టీ- 20- కోల్ కతా

Also Read: Subhas Chandra Bose: నేతాజీ 125 వ జయంతి నేడు.. ఢిల్లీలో హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ

Health: ఆరోగ్యానికి మంచిద‌ని వెల్లుల్లి తెగ తింటున్నారా.? ఈ స‌మ‌స్య‌లు ఎదుర్కోక‌ త‌ప్ప‌దు..

Longest Names: ఆ పెంపుడు కుక్క పేరు చాంతాడంత.. అందుకే గిన్నిస్ ఎక్కింది. అదొక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి..

భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!
ఆదివారం ఈ పనులు అస్సలు చేయొద్దు.. కోరి సమస్యలు తెచ్చుకోకండి
ఆదివారం ఈ పనులు అస్సలు చేయొద్దు.. కోరి సమస్యలు తెచ్చుకోకండి