IND VS SA : నేటి నుంచే వన్డే సిరీస్ సమరం.. శుభారంభం కోసం ఇరుజట్ల ఆరాటం..
ఉత్కంఠభరితమైన టెస్ట్ సిరీస్ తర్వాత, ఇప్పుడు భారత్, దక్షిణాఫ్రికా జట్లు బుధవారం నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడనున్నాయి
ఉత్కంఠభరితమైన టెస్ట్ సిరీస్ తర్వాత, ఇప్పుడు భారత్, దక్షిణాఫ్రికా జట్లు బుధవారం నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడనున్నాయి . బోలాండ్ పార్క్ వేదికగా మొదటి రెండు వన్డేలు జరగనున్నాయి. కాగా టెస్ట్ సిరీస్ ను 2-1తో కైవసం చేసుకున్న సఫారీలు వన్డే సిరీస్ లోనూ శుభారంభం చేయాలని భావిస్తుండగా, కనీసం వన్డే సిరీస్ లోనైనా ఆధిపత్యం చెలాయించాలని టీమిండియా భావిస్తోంది. కొత్త కెప్టెన్ కేఎల్ రాహుల్ నాయకత్వంలో టీమిండియా ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం. కాగా వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు బోలాండ్ పార్క్ లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయన్నదే అసలు ప్రశ్న. టెస్ట్ సిరీస్ లో చాలాసార్లు ఆటకు వరుణుడు అడ్డుపడ్డాడు.
వాతావరణం ఎలా ఉంటుందంటే..
అయితే వన్డే సిరీస్ కు మాత్రం ఎలాంటి వర్షం అడ్డంకి ఉండదని అక్కడి వెదర్ వెబ్ సైట్లు చెబుతున్నాయి. ముఖ్యంగా బుధవారం నాడు బోలాండ్ పార్క్ లో వాతావరణం చాలా పొడిగా ఉంటుందని. రోజంతా ఎండ కాస్తుందని , రాత్రి కూడా వర్షం కురిసే అవకాశం లేదని తెలుస్తోంది. ఉష్ణోగ్రత 34 డిగ్రీలకు పైనే ఉంటుంది. ఇక పిచ్ విషయానికొస్తే.. బోలాండ్‌లో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రాత్రి వేళల్లో భారీగా మంచు కురిసే అవకాశం ఉంది. ఇది బౌలర్లకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అందుకే టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ కే మొగ్గు చూపే అవకాశం ఉంది.
స్పిన్నర్లకు అనుకూలంగా..
బోలాండ్ పార్క్‌లో టీమిండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే ఈ పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలించే అవకాశాలున్నాయి. అదే సమయంలో బ్యాటింగ్ కు కూడా స్వర్గధామంగా ఉంటుందని తెలుస్తుంది. కాగా . ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కేఎల్ రాహుల్ మాట్లాడుతూ తొలి, రెండో వన్డేల్లో పిచ్ స్పిన్నర్లకు ఉపయోగపడుతుందన్నాడు. అందుకు తగ్గట్లే టీమిండియాలో అశ్విన్, చాహల్ రూపంలో ఇద్దరు వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారన్నాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటే ఇద్దరికీ అవకాశం కల్పిస్తామని కొత్త కెప్టెన్ చెప్పుకొచ్చాడు.
భారత వన్డే జట్టు
కేఎల్ రాహుల్ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, యుజువేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్ , దీపక్ చాహర్, ఫేమస్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్, నవదీప్ సైనీ.
దక్షిణాఫ్రికా వన్డే జట్టు
టెంబా బావుమా (కెప్టెన్), కేశవ్ మహరాజ్ (వైస్ కెప్టెన్), క్వింటన్ డి కాక్, జుబైర్ హంజా, మార్కో యాన్సన్, యెనెమన్ మలన్, సిసంద మగాలా, ఐడాన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్‌గిడి, వేన్ పార్నెల్, ఆండిలే ఫెహ్లుక్వాయో డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబడా, తబ్రేజ్ షమ్సీ, రాసి వాన్ డెర్ దుసాయి, కైల్ రెన్
భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Also Read: Agriculture News: పంట మార్పిడి పాటిస్తే రైతుల ఆదాయం ఆటోమేటిక్‌గా పెరుగుతుంది.. ఎలాగంటే..?
జుట్టు తెల్లబడటం మొదలైందా..కంగారు పడవద్దు..వెంటనే ఇలా చేయండి…(వీడియో)
Viral: నక్షత్రమండలం నుంచి భూమిని చేరిని అరుదైన ‘నలుపు’ వజ్రం.. త్వరలోనే వేలం!