AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs England 2nd Test : భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్.. రెండో వన్డేలో 317 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా..

India vs England 2nd Test Day 4 Live Score: చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో రెస్ట్ మ్యాచ్‌లో నాలుగవ..

India vs England 2nd Test : భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్.. రెండో వన్డేలో 317 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా..
Shiva Prajapati
|

Updated on: Feb 16, 2021 | 1:43 PM

Share

India vs England 2nd Test Day 4 Live Score: నాలుగు టెస్ట్ మ్యాచ్‌‌ సిరీస్‌లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. రెండో టెస్ట్ మ్యాచ్‌లో 317 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై టీమిండియా జయకేతనం ఎగురవేసింది. దీంతో సిరీస్‌ 1-1 తో సమంగా ఉంది. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ విన్ అవగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది.

ఇక రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం నుంచి.. ఆధిక్యతలోనే ఉన్న టీమిండియా.. ఇంగ్లండ్‌ను ఏ సమయంలోనూ నిలదొక్కుకోనివ్వలేదు. ముఖ్యంగా భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, అక్సర్ పటేల్ విజృంభణతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు.. కాసేపు నిలకడగానే ఆడినట్లు కనిపించినా.. అశ్విన్ బౌలింగ్‌లో లారెన్స్ స్టంప్ ఔట్ అయ్యాడు. అది మొదలు.. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఒక్కొక్కరు వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. మొత్తంగా నాలుగో రోజు 54 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ జట్టు 164 పరుగులు మాత్రమే చేసి టీమిండియా చేతిలో దారుణంగా ఓటమిపాలైంది.

ఇక రెండో టెస్ట్ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ జట్టును హడలెత్తించాడు. ఈ మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టడమే కాకుండా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 106 పరుగులతో సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. టీమిండియా ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి నుంచే దూకుడు ప్రదర్శిస్తూ ఆడాడు. తన బ్యాట్‌తో వీర విహారం చేశాడు. తొలుత 130 బంతులకే సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ అనంతరం ఆటను నిలకడగా కొనసాగించాడు. మొత్తంగా 231 బంతులు ఆడిన రోహిత్ శర్మ 161 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉసూరుమనించాడు. డకౌట్ అయి క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేశాడు. భారత్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 616 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 300 పరుగులు కూడా చేయలేకపోయింది.

బౌలింగ్ విషయానికి వస్తే.. అశ్విన్ తరువాత అక్సర్ పటేల్, ఇశాంత్ శర్మ అద్భుతమైన బౌలింగ్ చేసి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించారు. ఇటు స్పిన్ మాయాజాలంతో పాటు, ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును హడలెత్తించారు. వరుసగా వికెట్లు పడగొట్టి టీమిండియాకు అద్భుత విజయాన్ని సాధించి పెట్టారు. రెండో టెస్ట్ మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌లలోనూ అక్సర్ పటేల్ 7 వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్ శర్మ 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు చొప్పున తీసుకున్నారు.

స్కోర్లు..: భారత్: 329 & 286 ఇంగ్లండ్: 134 & 164

Key Events

అశ్విన్ 8, అక్సర్ 7.. బౌలింగ్‌లో రఫ్సాడించారు..

రెండో టెస్ట్‌లో బౌలర్లు అశ్విన్, అక్సర్ వావ్ అనిపించారు. అశ్విన్ 8 వికెట్లు తీసుకోగా.. అరంగేట్రంలోనే అక్సర్ 7 వికట్లు తీసుకున్నాడు.

రోహిత్ 161, అశ్విన్ 106 పరుగులతో దుమ్మురేపారు..

రెండో టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 161 పరుగుల చేయగా.. అశ్విన్ 106 పరుగులు చేశారు..

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 16 Feb 2021 12:34 PM (IST)

    తొమ్మిది వికెట్లు సమర్పించుకున్న ఇంగ్లండ్.. గెలుపునకు ఒక వికెట్ దూరంలో భారత్..

    లంచ్ బ్రేక్ అనంతరం ఇంగ్లండ్ మరో రెండు వికెట్లు వరుసగా సమర్పించుకుంది. మరో వికెట్ కోల్పోతే భారత్ విజయం సాధించినట్లే. ప్రస్తుత ఇంగ్లండ్ స్కోర్ 160-9 గా ఉంది. ప్రస్తుతం క్రీజ్‌లో స్టువర్ట్ బ్రాడ్, మొయీన్ అలీ ఉన్నారు.

  • 16 Feb 2021 11:41 AM (IST)

    లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 116-7.. భారత్‌ను ఊరిస్తున్న విజయం..

    చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 116-7. ఈ మ్యాచ్‌ గెలవాలంటే ఇంగ్లండ్ ఇంకా 366 పరుగులు చేయాల్సి ఉంది. అయితే, భారత్‌ మాత్రం విజయానికి చాలా దగ్గరగా ఉంది. మరో మూడు వికెట్లు పడగొట్టినట్లయితే టీమిండియా విజయం సాధిస్తుంది.

  • 16 Feb 2021 11:34 AM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. 116 పరుగుల వద్ద బెన్ ఫోక్స్ ఔట్..

    ఇంగ్లండ్ మరో వికెట్ సమర్పించుకుంది. 48వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ వేసిన 3వ బంతిని బెన్ ఫోక్స్ షాక్ కొట్టాడు. అది కాస్తా.. అక్సర్ పటేల్ చేతిలో పడింది. బెన్ ఫోక్స్ క్రిజ్ నుంచి వెనుదిరిగాడు. రెండు పరుగులు చేసిన బెన్ ఫోక్స్ తొమ్మిది బంతులు ఆడాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోర్ 116-7.

  • 16 Feb 2021 11:20 AM (IST)

    విజయానికి చేరువలో భారత్.. వరుసగా వికెట్లు సమర్పించుకుంటున్న ఇంగ్లండ్.. స్కోర్ 113-6

    చెపాక్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయానికి చేరువలో ఉంది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ వరుసగా వికెట్లు సమర్పించుకుంటున్నారు. ఇప్పటికే 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఇంకా 369 పరుగులు చేయాల్సింది ఉంది. అయితే, ఇది జరిగే పనికాదు. ప్రస్తుతం ఆరు వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ స్కోర్ 113గా ఉంది.

  • 16 Feb 2021 11:15 AM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. పోప్‌ను పెవిలియన్‌కు పించిన అరక్సర్ పటేల్..

    ఇంగ్లండ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. స్పిన్నర్ల దెబ్బకు వరుసగా వికెట్లు సమర్పించుకుంటున్నారు. ఇంగ్లండ్ బౌలర్లు. తాజాగా ఇంగ్లండ్ టీమ్ మరో వికెట్‌ను కోల్పోయింది. అక్సర్ పటేల్ బౌలింగ్‌లో పోప్ షాట్ ట్రై చేయగా.. బంతి ఇషాంత్ శర్మ క్యాచ్ చేశాడు. దాంతో పోప్ పెవిలియన్ బాట పట్టాడు.

  • 16 Feb 2021 11:05 AM (IST)

    కీపర్ రిషబ్ పంత్ సూపర్ స్టంపింగ్.. మరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

    టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతంగా కీపింగ్ చేశాడు. మెరుపు వేగంతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ లారెన్స్‌ను అవుట్ చేశాడు. నాలుగో రోజు మ్యాచ్‌లో 25వ ఓవర్‌లో అశ్విన్ వేసిన బంతిని షాట్ ఆడేందుకు లారెన్స్ ప్రయత్నించాడు. ఆ క్రమంలో అతను క్రీజ్ దాటి ముందుకు వచ్చాడు. కానీ బంత్ మిస్ అయ్యి కీపర్ రిషబ్ పంత్ చేతిలో పడింది. మెరుపు వేగంతో స్పందించిన పంత్.. లారెన్స్‌ను స్టంప్ ఔట్ చేసి పెవిలియన్‌కు పంపించాడు. కాగా, ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోర్ 107-5 గా ఉంది.

  • 16 Feb 2021 10:01 AM (IST)

    రఫ్సాడిస్తున్న భారత బౌలర్ రవింద్రన్ అశ్విన్.. నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

    భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండు టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. ముఖ్యంగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన బౌలింగ్‌తో ఇంగ్లండ్ జట్టును హడలెత్తిస్తున్నాడు. నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు మ్యాచ్‌ స్టార్ట్ అయిన కాసేపట్లోనే వికెట్ సమర్పించింది. దాంతో ఇంగ్లండ్ జట్టు స్కోర్ నాలుగు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది.

  • 16 Feb 2021 09:57 AM (IST)

    భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. నాలుగో రోజు ఇంగ్లండ్ స్కోర్ 63-3..

    చెపాక్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ నాలుగో రోజు ఆటను ప్రారంభించింది. ఇంగ్లండ్ విజయం సాధించాలంటే ఆ టీమ్ ఇంకా 429 పరుగులు చేయాల్సింది ఉంది. అయితే, పిచ్‌పై బాల్ ఎక్కువగా స్వింగ్ అవుతుండటంతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు స్కోర్ 65-4 గా ఉంది.

Published On - Feb 16,2021 12:34 PM