నాలుగో టెస్ట్: భోజన విరామానికి ఆసీస్ 149/4.. క్రీజులో స్టీవ్ స్మిత్.. ఆధిక్యం 182..
India Vs Australia 2020: బ్రిస్బేన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆచితూచి ఆడుతోంది. నాలుగో రోజు...
India Vs Australia 2020: బ్రిస్బేన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆచితూచి ఆడుతోంది. నాలుగో రోజు ఆరంభంలోనే వరుస వికెట్లు పడగొట్టి షాక్ ఇచ్చిన టీమిండియా బౌలర్లకు మరో అవకాశం ఇవ్వకుండా.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ జాగ్రత్తగా ఆడుతున్నారు. ప్రస్తుతం క్రీజులో స్మిత్(28), గ్రీన్(4) ఉండగా.. లంచ్ విరామానికి ఆసీస్ నాలుగు వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసింది. భారత్ కంటే 182 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
క్రీజులో స్టీవ్ స్మిత్ ఉండటంతో.. ఆసీస్ భారీ టార్గెట్‌ను నిర్దేశించేందుకు ప్రయత్నిస్తోంది. అంతకముందు 21/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌కు.. ఓపెనర్లు వార్నర్ (48), హారిస్ (38) మంచి ఆరంభాన్ని అందించారు. అయితే భారత్ బౌలర్లు వెంటనే పుంజుకుని వరుస ఇంటర్వెల్స్‌లో వికెట్లు తీసి ఆసీస్‌కు గట్టి షాక్ ఇచ్చింది.
That’ll be lunch. Positives for both sides that session #AUSvIND
SCORES: https://t.co/IzttOVL3j4 pic.twitter.com/olYOKzYpS8
— cricket.com.au (@cricketcomau) January 18, 2021