India Vs Australia 2020: భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 274/5 పరుగులు..

India Vs Australia 2020: బ్రిస్బేన్ వేదికగా టీమ్‌ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్ మరో వికెట్‌...

  • Ravi Kiran
  • Publish Date - 1:29 pm, Fri, 15 January 21
India Vs Australia 2020: భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 274/5 పరుగులు..
India Vs Australia

India Vs Australia 2020: బ్రిస్బేన్ వేదికగా టీమ్‌ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్ మరో వికెట్‌ పడకుండా ఆచితూచి ఆడారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించే దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట పూర్తయ్యే సమయానికి 274/5 పరుగులు చేసింది.

యువ బ్యాట్స్‌మెన్ లబూషేన్(108) సెంచరీతో అదరగొట్టగా.. స్టీవ్ స్మిత్(36), వేడ్(45) రాణించారు. ప్రస్తుతం టిమ్‌పైన్(38*), గ్రీన్‌(28*) క్రీజులో ఉన్నారు. ఇక డేవిడ్ వార్నర్(1) మరోసారి తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. అటు భారత బౌలర్లలో నటరాజన్ 2 వికెట్లు.. సుందర్, సిరాజ్, ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు.