పాకిస్తాన్ కెప్టెన్‌పై ఎఫ్ఐర్ నమోదు చేయాలని ఆదేశాలు.. ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

పాకిస్తాన్ కెప్టెన్‌పై ఎఫ్ఐర్ నమోదు చేయాలని ఆదేశాలు.. ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

Pak Captain Babar Azam: పాకిస్తాన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని లాహోర్‌లోని అదనపు సెషన్స్‌ కోర్టు

uppula Raju

|

Jan 15, 2021 | 12:24 PM

Pak Captain Babar Azam: పాకిస్తాన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని లాహోర్‌లోని అదనపు సెషన్స్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశించింది. హమీజా అనే మహిళ ఫిర్యాదు మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. లాహోర్‌కు చెందిన హమీజా ముక్తార్‌ అనే మహిళ బాబర్‌ తనను పెళ్లాడతానని 2010లో ప్రపోజ్ చేశాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడని ఆరోపిస్తుంది.

అంతేకాకుండా తనకు ఓ సారి బలవంతంగా అబార్షన్‌ కూడా చేయించాడని తెలిపింది. ఈ నేపథ్యంలో హమీజా‌ తరఫు న్యాయవాది ఇందుకు సంబంధించిన వైద్య పత్రాలను కోర్టుకు సమర్పించారు. దీంతో ఇరు వర్గాల వాదనలు విన్న అదనపు సెషన్స్‌ కోర్టు బాబర్‌‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా‌ పోలీసులను ఆదేశించింది. ఇదిలా ఉంటే కేసును ఉపసంహరించుకోవాలని తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని గతంలోనే హమీజా ఆరోపించింది. దీంతో ఈ విషయంలో స్పందించిన అదనపు సెషన్స్ జడ్జి అబిద్ రాజా బాబర్, అతడి కుటుంబ సభ్యులను హెచ్చరించింది. బొటనవేలు గాయం కారణంగా బాబర్ ఇప్పటికే న్యూజిలాండ్‌లో సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే.

పాకిస్తాన్ క్రికెటర్ పై లైంగిక ఆరోపణలు… ప్రేమించానన్నాడు… పేరొచ్చాక వొదిలేశాడన్న మహిళ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu