బయటకు వేరే కలరింగ్.. లోపల మాత్రం పాడు పనులు.. నెల్లూరులో హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు

స్పా సెంటర్ల పేరిట, ఫిజియోథెరపీ క్లినిక్‌ల ముసుగులో వ్యభిచార దందాలను కొనసాగిస్తున్నాయి.

బయటకు వేరే కలరింగ్.. లోపల మాత్రం పాడు పనులు.. నెల్లూరులో హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు
prostitution
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 15, 2021 | 12:18 PM

Hitech prostitution scandal : ఇప్పటి వరకు ప్రధాన నగరాలకే పరిమితమైన హైటెక్ వ్యభిచారం నెల్లూరు నగరాలకు కూడా విస్తరిస్తున్నాయి. పోలీసులు కంటపడకుండా ఉండేందుకు కొత్త దారులు ఎంచుకుంటున్నాయి. బయటకు వేరే కలరింగ్ ఇచ్చి లోపల మాత్రం పాడు పనులకు తెరతీస్తున్నాయి. స్పా సెంటర్ల పేరిట, ఫిజియోథెరపీ క్లినిక్‌ల ముసుగులో వ్యభిచార దందాలను కొనసాగిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

నెల్లూరు నగరంలో సెలూన్ పేరిట జరుగుతున్న హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు చేశారు పోలీసులు. సెలూన్ పై దాడి చేసిన పోలీసులు కోల్‌కత్తాకి చెందిన ఒక యువకుడితో పాటు విటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని దర్గామిట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఫ్లాటినమ్ సెలూన్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. కోల్‌కతా వంటి నగరాల నుంచి యువతులు తీసుకువచ్చి వ్యభిచార దందా నిర్వహిస్తున్నారని పోలీసలు తెలిపారు. గుట్టుచప్పుడు కాకుండా కొంతకాలంగా ఈ పాడుపని కొనసాగిస్తున్నారు. అయితే ఫ్లాటినమ్ సెలూన్‌లో పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించడంతో.. అక్కడ జరుగుతున్న పాడు పని వెలుగులోకి వచ్చింది. దీంతో ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, దర్గామిట్ట ప్రాంతంలో ఈ వ్యభిచార ముఠా గుట్టు రట్టుకావడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.