అడ్డదారిలో ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాందించాడు.. అధికారుల తనిఖీలో అడ్డంగా బుక్కయ్యాడు..

అడ్డదారిలో ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాందించాడు.. అధికారుల తనిఖీలో అడ్డంగా బుక్కయ్యాడు..

ఇద్దరు వ్యక్తులు ఫోర్జరీ చేసిన నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని సీబీఐ దర్యాప్తులో తేలింది.

Balaraju Goud

|

Jan 15, 2021 | 1:04 PM

నకిలీ పత్రాలతో ఉద్యోగం చేయాలనుకున్న ఓ వ్యక్తి అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఎస్టీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన ఇద్దరిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు కేసు నమోదు చేశారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఎంటీఎన్ఎల్ లలో పనిచేసిన ఇద్దరు వ్యక్తులు ఫోర్జరీ చేసిన నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని సీబీఐ దర్యాప్తులో తేలింది. 35 ఏళ్ల పాటు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేశారని సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో సీబీఐ అధికారులు యూపీ, ఢిల్లీలలో సోదాలు నిర్వహించారు.

ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఈపీఎఫ్ఓ కార్యాలయంలో 1985 జులై 24వతేదీన క్లర్కుగా విధుల్లో చేరాడు. నకిలీ ఎస్టీ సర్టిఫికెటుతో ఉద్యోగం సంపాదించాడు. అనంతరం మధుర అకౌంట్స్ ఆఫీసరుగా పదోన్నతి పొందారు. దీంతో అతనిపై ఫిర్యాదు రావడంతో సీబీఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు. మరో కేసులో ఎంటీఎన్ఎల్ సంస్థలో జూనియర్ టెలికం ఆఫీసరుగా నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందారని వెల్లడైంది. ఎంటీఎన్ఎల్ 2018 జులై 31 న సీనియర్ మేనేజరుగా పదవీ విరమణ చేశారు. దీంతో 35 ఏళ్ల తరువాత వారిపై ఫిర్యాదులు రావడంతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఇద్దరు నకిలీ ఎస్టీ సర్టిఫికేట్లతో విధుల్లో చేరినట్లు సీబీఐ అదికారులు నిర్ధారించారు. వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Read Also… బయటకు వేరే కలరింగ్.. లోపల మాత్రం పాడు పనులు.. నెల్లూరులో హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu