అజ్లాన్‌ షా టోర్నమెంట్ లో ఫైనల్ కు చేరిన భారత్

అజ్లాన్‌ షా హాకీ టోర్నమెంట్ లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం భారత్‌ 7-3 తేడాతో కెనడాను చిత్తు చేసి, మరో లీగ్‌ మ్యాచ్‌ మిగిలుండగానే ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకుంది. ఇక స్ట్రైకర్‌ మన్‌దీప్‌ సింగ్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే భారత్ నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలు, ఒక డ్రాతో మొత్తం 10 పాయింట్లు సాధించి ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకుంది. కాగా మలేసియాపై […]

  • Updated On - 8:39 pm, Fri, 5 April 19 Edited By: Pardhasaradhi Peri
అజ్లాన్‌ షా టోర్నమెంట్ లో ఫైనల్ కు చేరిన భారత్

అజ్లాన్‌ షా హాకీ టోర్నమెంట్ లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం భారత్‌ 7-3 తేడాతో కెనడాను చిత్తు చేసి, మరో లీగ్‌ మ్యాచ్‌ మిగిలుండగానే ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకుంది. ఇక స్ట్రైకర్‌ మన్‌దీప్‌ సింగ్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే భారత్ నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలు, ఒక డ్రాతో మొత్తం 10 పాయింట్లు సాధించి ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకుంది. కాగా మలేసియాపై 2-1తో నెగ్గిన కొరియా కూడా ఫైనల్‌ చేరింది. ఇక రెండు జట్ల మధ్య ఫైనల్‌ ఆదివారం జరుగనుంది. శుక్రవారం నామమాత్రమైన తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ పోలెండ్‌ తో తలపడనుంది.