ఎయిర్ పోర్టు సిబ్బందిపై రోహిత్ శర్మ ఆగ్రహం.. ఎందుకంటే?

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు వైజాగ్‌లోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ 203 పరుగుల తేడాతో విజయడంకా మోగించింది. ఇక రెండో టెస్ట్ కోసం ఇరు జట్లూ పుణే బయల్దేరాయి. అయితే ఎయిర్‌పోర్ట్ చేరుకున్న టీమిండియా క్రికెటర్లు మాత్రం వర్షంలో తడిసి ముద్దయ్యారు. వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో భారత ఆటగాళ్ల బస్సును ప్లాట్‌ఫార్మ్ 1పై నిలపాల్సి ఉండగా.. సఫారీ క్రికెటర్లకు అక్కడ అనుమతులు ఇచ్చి.. టీమిండియా […]

ఎయిర్ పోర్టు సిబ్బందిపై రోహిత్ శర్మ ఆగ్రహం.. ఎందుకంటే?
Follow us

|

Updated on: Oct 08, 2019 | 4:07 AM

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు వైజాగ్‌లోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ 203 పరుగుల తేడాతో విజయడంకా మోగించింది. ఇక రెండో టెస్ట్ కోసం ఇరు జట్లూ పుణే బయల్దేరాయి. అయితే ఎయిర్‌పోర్ట్ చేరుకున్న టీమిండియా క్రికెటర్లు మాత్రం వర్షంలో తడిసి ముద్దయ్యారు.

వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో భారత ఆటగాళ్ల బస్సును ప్లాట్‌ఫార్మ్ 1పై నిలపాల్సి ఉండగా.. సఫారీ క్రికెటర్లకు అక్కడ అనుమతులు ఇచ్చి.. టీమిండియా బస్సును ప్లాట్‌ఫార్మ్ 3 వద్దకు పంపారు. దీంతో భారత క్రికెటర్లు ప్లాట్‌ఫామ్‌ 3 నుంచి నడుచుకుంటూ ప్రత్యేక విమానం వద్దకు చేరుకోవాల్సి వచ్చింది. వారి దిగిన చోట పైకప్పు కూడా లేకపోవడంతో ఆటగాళ్లు పూర్తిగా వర్షంలో తడిసిపోయారు. ఈ విషయమై రోహిత్ శర్మ ఎయిర్ పోర్టు సీఐని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇక అక్కడున్న అధికారులు తమను సమర్ధించుకునే ప్రయత్నం చేశారట. ఎయిర్‌పోర్ట్ ఎంట్రీ మరమ్మత్తుల కారణంగానే బస్సును కొద్ది దూరంలో ఆపాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారని సమాచారం. కాగా, టీమిండియా క్రికెటర్లు మాత్రం సిబ్బంది నిర్లక్ష్యం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు