PV Sindhu: పద్మ భూషణ్ అందుకున్న బ్యాడ్మింటన్ క్వీన్ .. సోషల్ మీడియాలో హైదరాబాదీ స్టార్‌కు శుభాకాంక్షల వెల్లువ..
ప్రముఖ హైదరాబాదీ క్రీడాకారిణి, బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు పద్మభూషన్ అవార్డును అందుకుంది. సోమవారం దిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని..
ప్రముఖ హైదరాబాదీ క్రీడాకారిణి, బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు పద్మభూషన్ అవార్డును అందుకుంది. సోమవారం దిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకుందీ స్టార్ షట్లర్. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సింధు..అంతకు ముందు జరిగిన రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెల్చుకుంది. ఇక 2019లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఈ హైదరాబాదీ స్టార్ అంతకుముందు వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీల్లో రెండు కాంస్యాలు, రెండు రజతాలు సాధించింది. ఈ క్రమంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఎక్కువ పతకాలు సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
తన అత్యద్భుత ఆటతీరుకు గుర్తింపుగా ఇప్పటికే ఎన్నో పురస్కారాలు అందుకుంది సింధు. 2015 లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఈ బ్యాడ్మింట్ క్వీన్ 2017లోనే పద్మభూషణ్‌కు నామినేట్ అయ్యింది. అయితే తుది జాబితాలో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది. తాజాగా ఆ పురస్కారం కూడా ఆమె కీర్తి కిరీటంలో చేరిపోయింది. కాగా భారత ప్రభుత్వ మూడో అత్యున్నత పురస్కారం ‘పద్మభూషణ్’ అందుకోవడంపై సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Delhi: Olympian badminton player PV Sindhu awarded the Padma Bhushan pic.twitter.com/TqUldnQgr3
— ANI (@ANI) November 8, 2021
Also Read:
French Open: సెమీఫైనల్‌ల్లో ఓడిన పీవీ సింధు.. ఫ్రెంచ్ ఓపెన్‌లో ముగిసిన భారత ప్రయాణం..!
Hylo Open: 32 నిమిషాల్లోనే ప్రత్యర్థిని ఓడించిన కిదాంబి శ్రీకాంత్.. రెండో రౌండ్‌లోకి ప్రవేశం..!