AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సచిన్ డాటర్‌తో..యువ క్రికెటర్ల సరాగాలు!

యువక్రికెటర్ శుభ్ మన్ గిల్ అందరికి సుపరిచితుడే. ఐపీఎల్ ద్వారా ఈ కుర్రోడు బాగానే ఫేమస్ అయ్యాడు. అయితే ఇప్పడు అంతకు పదింతలు ఈ యంగ్ క్రికెటర్‌కు ఒక్కరోజులోనే క్రేజ్ వచ్చింది. ఎలా అంటారా?  ఈ కుర్రాడు ఈ మధ్యనే కొత్త రేంజ్ రోవర్ కారు కొన్నాడు. దాంతో దిగిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ మాత్రానికే అంత చెప్తున్నారు..రోంజ్ రోవర్ కార్లు ఎవరూ కొనరని అనుకుంటున్నారా? అబ్బా ఇక్కడే ఉందండి అసలు […]

సచిన్ డాటర్‌తో..యువ క్రికెటర్ల సరాగాలు!
Ram Naramaneni
|

Updated on: Jun 16, 2019 | 1:37 PM

Share

యువక్రికెటర్ శుభ్ మన్ గిల్ అందరికి సుపరిచితుడే. ఐపీఎల్ ద్వారా ఈ కుర్రోడు బాగానే ఫేమస్ అయ్యాడు. అయితే ఇప్పడు అంతకు పదింతలు ఈ యంగ్ క్రికెటర్‌కు ఒక్కరోజులోనే క్రేజ్ వచ్చింది. ఎలా అంటారా?  ఈ కుర్రాడు ఈ మధ్యనే కొత్త రేంజ్ రోవర్ కారు కొన్నాడు. దాంతో దిగిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ మాత్రానికే అంత చెప్తున్నారు..రోంజ్ రోవర్ కార్లు ఎవరూ కొనరని అనుకుంటున్నారా? అబ్బా ఇక్కడే ఉందండి అసలు ట్విస్ట్.

గిల్ పెట్టిన పోస్ట్‌కు క్రికెటర్ దేవుడు సచిన్ కుమార్తె సారా కంగ్రాట్స్ చెబుతూ లవ్ ఎమోజీని జత చేసింది. అందుకు కృతజ్ఞతగా గిల్‌ ‘‘థాంక్స్’’ అని పోస్టు చేయడంతో పాటు తానూ ఏం తక్కువ తినలేదన్నట్టు లవ్ ఎమోజీని పోస్టు చేశాడు. ఐతే నెటిజన్లు ఊరుకుంటారా? ఎంటోయ్..విషయం అంటూ గిల్‌ను ఆట పట్టించడం షురూ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఇష్యూను మరో లెవల్ కు తీసుకెళ్లాడు టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.

ఎప్పుడు చలాకీగా ఉంటూ సహచరుల్ని సరదాగా ఆటపట్టించే పాండ్యా ఇలాంటి విషయాల్లో కామ్ గా ఉంటాడా?  అతనూ రియాక్ట్ అయ్యాడు. గిల్‌ను ఆటపట్టించేందుకు ‘‘ఆమె నుంచి స్వాగతం’’ అనే సందేశంతో పాటు కన్ను కొడుతున్న ఎమోజీని పంపించాడు. మామూలుగా ఐతే ఇలాంటివి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ సచిన్‌ కూతురు విషయంలో హార్దిక్‌ ఇలా ప్రవర్తించడంలో అందరూ ఈ విషయంపై ఆసక్తి చూపిస్తున్నారు. దానికి రిప్లై ఏం వస్తుందా అని ఇన్ స్టాలో పదే పదే సెర్చ్ చేస్తున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ..ఈ పోస్ట్‌ల సందడి ఎన్నిమలుపులు తిరుగుతుందో.

View this post on Instagram

Thalle mere Range akh baaz naalo tezz! Caption credits- @jassie.gill ?

A post shared by Ꮪhubman Gill (@shubmangill) on