కోహ్లీకి డేంజరస్ ఛాలెంజ్ విసిరిన హార్దిక్..
భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలు ఒకరిపై ఒకరు ఫిట్నెస్ సవాళ్లు విసురుకుంటున్నారు. ఈసారి ఓ డేంజరస్ ఎక్సర్సైజ్ చేయమని విరాట్‌కు ఛాలెంజ్ విసిరాడు హార్దిక్.
భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలు ఒకరిపై ఒకరు ఫిట్నెస్ సవాళ్లు విసురుకుంటున్నారు. ఈసారి ఓ డేంజరస్ ఎక్సర్సైజ్ చేయమని విరాట్‌కు ఛాలెంజ్ విసిరాడు హార్దిక్. అందుకు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు.
Hey bruh @imVkohli Always got your back ?@klrahul11 @krunalpandya24, guys would you like to have a go ✅? pic.twitter.com/Vur8PHP3NY
— hardik pandya (@hardikpandya7) July 4, 2020
కొద్ది రోజుల క్రితం గాల్లోకి ఎగిరి ‘పుష్ అప్స్’ చేసిన వీడియోను హార్దిక్ షేర్ చెయ్యగా.. విరాట్ దానికి క్లాప్స్ కొట్టి మరో వీడియోను పోస్ట్ చేశాడు. ఈసారి పాండ్యా గాల్లోకి ఎగిరి వీపు వెనుక చప్పట్లు కొడుతూ చేసిన ‘పుష్ అప్స్’ ట్వీట్ చేశాడు. దీనిని ట్రై చెయ్యమని కోహ్లీకి ఛాలెంజ్ విసిరాడు. వెన్ను గాయానికి సర్జరీ చేయించున్న కారణంగా గతేడాది సెప్టెంబరు నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు హార్దిక్ పాండ్యా. కోలుకున్నాక ఆటపై ఫోకస్ పెట్టి ఫిబ్రవరిలో పూర్తి ఫిట్నెస్ సాధించాడు. మార్చిలో సౌతాఫ్రికాతో సిరీస్‌కు రెడీ అయ్యాడు. కానీ కోవిడ్-19 వ్యాప్తి కారణంగా లాక్డౌన్ విధించడం వల్ల మ్యాచ్‌లు నిలిచిపోయాయి. దీంతో ఈ క్రేజీ ఆల్‌రౌండర్ రీఎంట్రీ ఆలస్యమైంది.