Cricket: టీ20 ఫార్మట్ లో బీసీసీఐ కొత్త నిబంధన.. ఉపయోగించుకున్న మొదటి జట్టు అదే.. IPLలో దీని ప్రభావం ఎంతంటే..

టీ20 ఫార్మట్ లో బీసీసీఐ ఓ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్ పేరుతో తీసుకొచ్చిన ఈ నిబంధన కొన్ని సందర్భాల్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయవచ్చు. సయ్యద్ ముష్తాక్ అలీ టీ20 టోర్నమెంట్ ప్రస్తుతం జరుగుతుండగా.. ఈటోర్ని నుంచి ఇంపాక్ట్ ప్లేయర్..

Cricket: టీ20 ఫార్మట్ లో బీసీసీఐ కొత్త నిబంధన.. ఉపయోగించుకున్న మొదటి జట్టు అదే.. IPLలో దీని ప్రభావం ఎంతంటే..
Hrithik Shokeen
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 12, 2022 | 1:18 PM

టీ20 ఫార్మట్ లో బీసీసీఐ ఓ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్ పేరుతో తీసుకొచ్చిన ఈ నిబంధన కొన్ని సందర్భాల్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయవచ్చు. సయ్యద్ ముష్తాక్ అలీ టీ20 టోర్నమెంట్ ప్రస్తుతం జరుగుతుండగా.. ఈటోర్ని నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను బీసీసీఐ అమలులోకి తీసుకొచ్చింది. అయితే ఈ నిబంధనను తప్పకుండా ఉపయోగించుకోవాలనే షరతు ఏమి లేదు. అయితే సయ్యద్ ముష్తాక్ అలీ T20 ట్రోఫీలో ఢిల్లీ, మణిపూర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ ఆప్షన్ ను ఢిల్లీ జట్టు ఉపయోగించుకుంది. బీసీసీఐ ప్రవేశపెట్టిన తర్వాత ఈ ఆప్షన్ ఎంచుకున్న మొదటి జట్టుగా ఢిల్లీ నిలిచింది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో మణిపూర్‌తో అక్టోబర్ 11వ తేదీ మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ఓపెనర్ హితేన్ దలాల్ స్థానంలో బౌలింగ్ వేసే సమయంలో ఆఫ్ స్పిన్నర్ హృతిక్ షోకీన్‌తో నితీష్ రాణా నేతృత్వంలోని ఢిల్లీ జట్టు ఆడింది.

జైపూర్‌ వేదికగా మంగళవారం జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీలో మణిపూర్‌ పై ఢిల్లీ జట్టు 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంపెక్ట్ ప్లేయర్ ఆప్షన్ ను ఢిల్లీ జట్టు ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేసేటప్పుడు బ్యాట్స్ మెన్ ను, బౌలింగ్ చేసేటప్పుడు బౌలర్ ని టీమ్ లో ఆడించే అవకాశం కలుగుతుంది. దీంతో ఢిల్లీ జట్టు ఓపెనర్ హితేన్ దలాల్ 27 బంతుల్లో 47 పరుగులు చేయడంతో ఢిల్లీ ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. నితీష్ రాణా నేతృత్వంలోని జట్టు బౌలింగ్ చేస్తున్న సమయంలో హితేన్ దలాల్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ హృతిక్ షోకీన్‌ను తీసుకుంది. అతడు మూడు ఓవర్లు వేసి 13 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. దీంతో మణిపూర్ 96 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కొన్ని సందర్భాల్లో విజయంపై ప్రభావం చూపిస్తుందని ఢిల్లీ, మణిపూర్ మ్యాచ్ తో నిరూపితమైంది.

ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ఉపయోగించి జట్టులో ఆడించిన ఇద్దరు ప్లేయర్లు బాగా ఆడటంతో ఈ ఆప్షన్ ఎంచుకోవడం ఢిల్లీకి కలిసి వచ్చింది. వచ్చే ఐపీఎల్ నుంచి ఈ నిబంధనను అమలు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. దీనిలో భాగంగా తొలుత సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీలో ఈ నిబంధనను అమలులోకి తీసుకొచ్చింది. భవిష్యత్తులో ఈ నిబంధనపై ఐసీసీ సానుకూలంగా స్పందిస్తే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లలోనూ ఈ నిబంధనను అమలు చేసే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..