వార్నర్‌- క్యాండిస్‌ దంపతుల కూతురు పెద్దయ్యాక కోహ్లీలా అవ్వాలనుకుంటున్నదట!

ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఫ్యామిలీకి ఇండియా అంటే మహా ఇష్టం.. ఆ ఆష్టంతోనే తన రెండో కూతురుకు ఇండిరే అనే పేరు పెట్టుకున్నారు..

వార్నర్‌- క్యాండిస్‌ దంపతుల కూతురు పెద్దయ్యాక కోహ్లీలా అవ్వాలనుకుంటున్నదట!
Follow us
Balu

|

Updated on: Nov 20, 2020 | 12:38 PM

ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఫ్యామిలీకి ఇండియా అంటే మహా ఇష్టం.. ఆ ఆష్టంతోనే తన రెండో కూతురుకు ఇండిరే అనే పేరు పెట్టుకున్నారు.. పేరు పెట్టుకున్నందుకు కాదు కానీ ఇండిరేకు టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ అంటే వీరాభిమానం! తను పెద్దయ్యాక కోహ్లీలా అవ్వాలని ఇప్పట్నుంచే కలలు కంటున్నదట! ఈ మాట వార్నర్‌ సతీమణి క్యాండిస్‌ చెప్పుకొచ్చారు. ఓ రేడియో కార్యక్రమంలో పాల్గొన్న క్యాండిస్‌ ఈ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. టైమ్‌ దొరికినప్పుడు ఇంటి ఆవరణలో క్రికెట్‌ ఆడుతామని అన్నారు. తమ కూతుళ్లు ఒక్కోసారి వాళ్ల నాన్నలా, కొన్నిసార్లు ఆరోన్‌ ఫించ్‌లా ఆడాలనుకుంటారని, రెండో కూతురు ఇండీరేకు మాత్రం విరాట్‌ కోహ్లీ అంటే విపరీతమైన అభిమానమని, పెద్దయ్యాక కోహ్లీలా అవ్వాలని అనుకుంటోందని క్యాండిస్‌ అన్నారు. ఇండిరే గతంతో కోహ్లీలా బ్యాటింగ్‌ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరస్‌ అయిన సంగతి తెలిసిందే! ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టోర్నమెంట్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌కు సారథ్యం వహిస్తున్న డేవిడ్‌ వార్నర్‌కు తెలుగు సినిమాలతో కూడా పరిచయం ఉంది. లాక్‌డౌన్‌ సమయంలో వార్నర్‌ ఫ్యామిలీ మన సినిమా పాటలతో, డైలాగులతో టిక్‌టాక్‌ వీడియోలు రూపొందించిన విషయం కూడా తెలిసిందే! ఈ వీడియోలు కూడా వార్నర్‌ ఫ్యామిలీకి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి..