మరో అడుగు దూరంలో… క్వార్టర్ ఫైనల్‌కు చేరిన భారత టెన్నిస్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్..
ప్రజ్నేశ్ గుణేశ్వరన్ ఒర్లాండో ఓపెన్ చాలెంజర్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో
భారత టెన్నిస్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ ఒర్లాండో ఓపెన్ చాలెంజర్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో గురువారం ప్రజ్నేశ్ 5-7, 7-5, 2-0తో ఉన్న దశలో ప్రత్యర్థి చైనీస్ తైపీ టంగ్ లిన్ వూ గాయం కారణంగా తప్పుకోవడంతో భారత ఆటగాడు ముందంజ వేశాడు.
తొలి సెట్ కోల్పోయి ఒక దశలో 2-5తో రెండో సెట్ కూడా ఓటమి పాలవడం ఖాయమను కున్న దశలో.. ప్రజ్నేశ్ అనూహ్యంగా పుంజుకున్నాడు. వరుసగా ఏడు గేమ్‌లు నెగ్గి మూడో సెట్‌కు చేరాడు.