మారిన టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ రూల్స్‌, ఫస్ట్‌ ప్లేస్‌ నుంచి సెకండ్‌ ప్లేస్‌లోకి వెళ్లిన టీమిండియా

టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌కు సంబంధించిన రూల్స్‌ను ఐసీసీ మార్చేసింది.. దీంతో టాప్‌ ప్లేస్‌లో ఉండాల్సిన భారత్‌ కాస్త సెకండ్‌ ప్లేస్‌లోకి వెళ్లింది.. వచ్చే ఏడాది జరగబోయే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం కొత్త నియమావళిని తీసుకువచ్చింది అంతర్జాతీయ క్రికెట్‌ మండలి..

మారిన టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ రూల్స్‌, ఫస్ట్‌ ప్లేస్‌ నుంచి సెకండ్‌ ప్లేస్‌లోకి వెళ్లిన టీమిండియా
Follow us
Balu

|

Updated on: Nov 20, 2020 | 12:58 PM

టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌కు సంబంధించిన రూల్స్‌ను ఐసీసీ మార్చేసింది.. దీంతో టాప్‌ ప్లేస్‌లో ఉండాల్సిన భారత్‌ కాస్త సెకండ్‌ ప్లేస్‌లోకి వెళ్లింది.. వచ్చే ఏడాది జరగబోయే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం కొత్త నియమావళిని తీసుకువచ్చింది అంతర్జాతీయ క్రికెట్‌ మండలి.. ఆడిన టెస్ట్‌ మ్యాచ్‌ల ఆధారంగా వచ్చిన పాయింట్లతో ఆయా జట్లకు ర్యాంకులు ఇస్తారు.. కరోనా వైరస్‌ కారణంగా క్రికెట్‌ మ్యాచ్‌ల నిర్వహణ కష్టంగా మారడం, దాదాపు అయిదారు నెలలు ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు జరగకపోవడం వంటివి దృష్టిలో పెట్టుకుని టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ రూల్స్‌లో మార్పులు తీసుకొచ్చారు. మారిన రూల్స్‌ ప్రకారం ఆస్ట్రేలియా 82.22 శాతం పాయింట్లతో నంబర్‌వన్‌ ప్లేస్‌కు వచ్చింది.. ఇండియా 75 శాతం పాయింట్లతో సెకండ్‌ ప్లేస్‌లో నిలిచింది. 60.83 శాతం పాయింట్లతో ఇంగ్లాండ్‌ మూడో స్థానంలో ఉంది.. 50 శాం పాయింట్లతో న్యూజిలాండ్‌ ఫోర్త్‌ ప్లేస్‌లో నిలిచింది. 39.5 శాతం పాయింట్లతో పాకిస్తాన్‌ అయిదో స్థానంలో, 33.3 శాతం పాయింట్లతో శ్రీలంక ఆరో ప్లేస్‌లో, 16.7 శాతం పాయింట్లతో వెస్టిండీస్‌ ఏడో స్థానంలో ఉన్నాయి.. పది శాతం పాయింట్లతో సౌతాఫ్రికా ఎనిమిదో స్థానంలో ఉండటం విశేషం. మ్యాచ్‌లు పూర్తి అయిన వాటి ఆధారంగా వ‌చ్చిన పాయింట్ల‌తో ర్యాంకింగ్స్ ఇస్తారు. కొన్ని జ‌ట్ల కోసం మ్యాచ్‌ల కోటాను పెంచేందుకు ఐసీసీ ఓకే చెప్పింది. వ‌చ్చే ఏడాది జూన్‌లో వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు సాహ‌నే తెలిపారు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, ఇండియా, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక‌, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య టెస్ట్ చాంపియ‌న్‌షిప్ నిర్వ‌హిస్తున్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌ను గత ఏడాది ప్రారంభించారు. రెండేళ్లలో 27 సిరీస్‌ల‌తో మొత్తం 71 మ్యాచ్‌లు నిర్వ‌హించాల‌ని అనుకున్నారు. కానీ కరోనా వైరస్‌ వచ్చి ఐసీసీ ప్లాన్‌ను దెబ్బ తీసింది. కరోనా కారణంగా ఆరు టెస్ట్ సిరీస్‌ల‌ను ర‌ద్దు చేయాల్సి వచ్చింది. ఇందులో బంగ్లాదేశ్‌కు చెందిన మ్యాచ్‌లే నాలుగు ఉన్నాయి.. అందుకే బంగ్లాదేశ్‌ సున్నా శాతం పాయింట్లతో చివరిస్థానంలో ఉండాల్సి వచ్చింది..