AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విరాట్ కోహ్లీ కంటే స్టీవ్ స్మిత్ బెటర్.. వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు..

అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవరు బెస్ట్ అంటే.? ఠక్కున టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అని కొందరు సమాధానమిస్తే.. మరికొందరు ఆస్ట్రేలియా మాజీ సారధి స్టీవ్ స్మిత్ అని అంటారు.

విరాట్ కోహ్లీ కంటే స్టీవ్ స్మిత్ బెటర్.. వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు..
Ravi Kiran
|

Updated on: Nov 20, 2020 | 2:55 PM

Share

Steve Smith Is Better Than Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవరు బెస్ట్ అంటే.? ఠక్కున టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అని కొందరు సమాధానమిస్తే.. మరికొందరు ఆస్ట్రేలియా మాజీ సారధి స్టీవ్ స్మిత్ అని అంటారు. ఈ చర్చ గత కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది. అయితే దిగ్గజ క్రికెటర్లు మాత్రం అన్ని ఫార్మాట్లలోనూ విరాట్ కోహ్లీ మేటి ఆటగాడని కితాబిస్తే.. టెస్టుల్లో స్టీవ్ స్మిత్‌కు సాటి ఎవ్వరూ లేరని అంటున్నారు. ఇదే కోవలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా స్టీవ్ స్మిత్‌పై ప్రశంసలు కురిపించాడు.

విరాట్ కోహ్లీతో పోలిస్తే టెస్టుల్లో స్టీవ్ స్మిత్ ఉత్తమ బ్యాట్స్‌మెన్ అని అనడంలో సందేహం లేదని చెప్పుకొచ్చాడు. దానికి కూడా కారణం ఉందని తెలిపాడు. నిషేధం తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన స్టీవ్ స్మిత్ నిలకడైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. ఒత్తిడిలో కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా పరుగులు వరద పారించాడు. అంతేకాదు వచ్చిన కొద్దిరోజుల్లోనే అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దీని వల్లే తాను స్మిత్‌కు టెస్టుల్లో ఉత్తమ బ్యాట్స్‌మెన్ హోదాను కట్టబెట్టినట్లుగా వసీం జాఫర్ వివరించాడు. కాగా, అన్ని ఫార్మాట్లలోనూ విరాట్ కోహ్లీకి ఎదురు లేదని కొనియాడాడు.

Also Read:

జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!

ఏపీ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. పంచారామాలకు 1,750 స్పెషల్ బస్సులు..