Telugu News Sports News CWG 2022 ‘Srikanth anna was distraught, It was painful to see him cry’ says Satwik after final loss vs Malaysia Telugu Sports News
CWG 2022: కామన్వెల్త్‌లో కన్నీరు పెట్టిన కిదాంబి శ్రీకాంత్.. తెలుగుతేజానికి ధైర్యం చెబుతోన్న అభిమానులు
Commonwealth Games 2022 :గత కామన్వెల్త్ గేమ్స్ లో భారత బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీం స్వర్ణం సాధించింది. దీంతో ఈసారి కూడా పసిడి సాధిస్తారని అనుకున్నారు.అయితే దురదృష్టవశాత్తూ ఈ ఈవెంట్‌లో సిల్వర్‌తోనే సరిపెట్టుకుంది.
Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. వెయిట్‌లిఫ్టింగ్, జుడో, టేబుల్ టెన్నిస్, లాన్స్ బౌల్స్, బ్యాడ్మింటన్ క్రీడల్లో కలిపి ఇప్పటివరకు మొత్తం 18 పతకాలు సాధించారు. ఇందులో 5 స్వర్ణాలు, 6 రజతాలు,7 కాంస్య పతకాలు ఉన్నాయి. కాగా గత కామన్వెల్త్ గేమ్స్ లో భారత బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీం స్వర్ణం సాధించింది. దీంతో ఈసారి కూడా పసిడి సాధిస్తారని అనుకున్నారు.అయితే దురదృష్టవశాత్తూ ఈ ఈవెంట్‌లో సిల్వర్‌తోనే సరిపెట్టుకుంది.ఈ ఈవెంట్ ఫైనల్లో భారత జట్టు 1-3 తేడాతో మలేషియా చేతిలో ఓడిపోయి రజతం గెల్చుకుంది. భారత జట్టు ఆడిన నాలుగు గేమ్‌ల్లో ఒక్క పీవీ సింధు (PV Sindhu) మాత్రమే గెలిచింది. స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌తో సహా సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీ కూడా ఫైనల్లో ఓటమిపాలలయ్యారు. దీంతో భారత్ బంగారు పతకం ఆశలు నీరుగారాయి.
కాగా ఓటమి అనంతరం తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ కంటతడి పెట్టాడు. తన వల్లే భారత్ బంగారు పతకం గెలిచే అవకాశాన్ని కోల్పోయిందని తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. శ్రీకాంత్ సహచరుడు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి ఈ విషయాన్ని మీడియాకు తెలిపాడు. ‘మ్యాచ్ ఓడాక శ్రీకాంత్ ఏడవడం చూసి చాలా బాధగా అనిపించింది. అతన్ని అలా చూడడం అదే మొదటిసారి’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఈవిషయం తెలుసుకున్న భారత క్రీడాభిమానులు శ్రీకాంత్‌కు మనోధైర్యం చెబుతున్నారు. ఆటల్లో గెలుపోటముల సహజమేనని ధైర్యం నూరిపోస్తున్నారు.
? for ??! @srikidambi gives his best but goes down fighting in the final game.