CWG 2022 Boxing: పవర్ పంచ్‌లతో చెలరేగిన తెలంగాణ బాక్సర్.. ప్రత్యర్థిని నాకౌట్ చేసి క్వార్టర్స్‌కు..
CommonWealth Games: తనపై ఉన్న అంచనాలను, నమ్మకాన్ని నిజం చేసే దిశగా భారత స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (Nikhat Zareen) ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్ లో ముందుడుగు వేసింది. మహిళల 50 కేజీల విభాగం బాక్సింగ్ పోటీల్లో శుభారంభం చేసి తర్వాతి రౌండ్ కు చేరుకుంది.
CommonWealth Games: తనపై ఉన్న అంచనాలను, నమ్మకాన్ని నిజం చేసే దిశగా భారత స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (Nikhat Zareen) ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్ లో ముందుడుగు వేసింది. మహిళల 50 కేజీల విభాగం బాక్సింగ్ పోటీల్లో శుభారంభం చేసి తర్వాతి రౌండ్ కు చేరుకుంది. ఆదివారం జరిగిన ప్రి క్వార్టర్స్ మ్యాచ్‌లో నిఖత్ మొజాంబిక్‌కు చెందిన హెలెనా ఇస్మాయిల్ బగావో ను నాకౌట్ చేసింది. తద్వారా క్వార్టర్స్ స్టేజ్ కు దూసుకెళ్లింది. కాగా మ్యాచ్ ఆరంభంలో హెలెనా పూర్తి ఆధిపత్యం చెలాయించగా.. అనుభవంతో పైచేయి సాధించింది . ఎదురుదాడికి దిగి ప్రత్యర్థిపై పంచుల వర్షం కురిపించింది. నిఖత్ పవర్ పంచులకు ఉక్కిరిబిక్కిరైన హెలెన్ ఆటను కొనసాగించలేక కూలబడిపోయింది. దీంతో బౌట్ ముగియడానికి మరో 48 సెకన్లు ఉండగానే పోటీని ఆపేసిన మ్యాచ్ రిఫరీ నిఖత్‌ను విజేతగా ప్రకటించారు. ఇక క్వార్టర్స్ స్టేజిలో టోరీ గార్టన్ (న్యూజిలాండ్)తో తలపడనుందీ తెలంగాణ అమ్మాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ ఖాతాలో మరో పతకం చేరినట్టే.
.@nikhat_zareen ADVANCES TO QF! ??
ఇవి కూడా చదవండిA thumping ? performance from the reigning world champion to start off her @birminghamcg22 campaign in style.
Great win, Nikhat ???#Commonwealthgames#B2022#PunchMeinHainDum 2.0#birmingham22 #boxing @Media_SAI pic.twitter.com/TMvJZv9ket
— Boxing Federation (@BFI_official) July 31, 2022
ముగిసిన శివ పోరాటం..
కాగా ఇదే ఈవెంట్‌లో ఆశలు రేకెత్తించిన మరో ఇండియర్ బాక్సర్ శివ థాప కామన్వెల్త్‌లో తన పోరాటాన్ని ముగించాడు. ఆరంభ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన ఈ యంగ్ బాక్సర్ రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో ఓటమి పాలవ్వడంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత, స్కాట్లాండ్ బాక్సర్ రీస్ లించ్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-4 తేడాతో థాప ఓటమి చవిచూశాడు.
#IND‘s?? @nikhat_zareen beat Helena Ismael Bagao in women’s 50 kg (Light Flyweight) & enters into the quarterfinals ?#TeamIndia | #Cheer4India | #B2022 | #CWG2022 pic.twitter.com/O3GJgbOPOk
— Doordarshan Sports (@ddsportschannel) July 31, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..