
వరల్డ్ ఛాంపియన్‌షిప్ లీగ్ 2024 టోర్నమెంట్ రెండో సెమీ-ఫైనల్‌లో భాగంగా ఆస్ట్రేలియాపై భారత ఛాంపియన్స్ జట్టు కెప్టెన్ యువరాజ్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అంబటి రాయుడుతో కలిసి ఓపెనర్ రాబిన్ ఉతప్ప భారత్‌కు శుభారంభం అందించాడు. అయితే ఆ తర్వాత రాయుడు, సురేశ్ రైనాలు వెంటవెంటనే ఔటయ్యారు. రాయుడు 14 పరుగులు, రైనా 5 పరుగులు చేశారు. ఆ తర్వాత ఉతప్ప, యువరాజ్ మూడో వికెట్‌కు 37 బంతుల్లో 47 పరుగులు జోడించారు. 35 బంతుల్లో 65 పరుగుల చేసిన ఉతప్ప ఔటయ్యే సమయానికి భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 103 పరుగులు. ఆ తర్వాత ఆ బాధ్యతను యువరాజ్ తన భుజస్కందాలపై వేసుకుని దండయాత్ర ప్రారంభించాడు యూవీ. ఆస్ట్రేలియా బౌలర్లను చిత్తు చేస్తూ ఫోర్లు, సిక్స్ ల వర్షం కురిపించాడు. కేవలం 26 బంతుల్లోనే 203.85 స్ట్రైక్ రేట్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యువరాజ్ తన అర్ధ సెంచరీలో 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. యువరాజ్ ఆడుతున్న తీరును బట్టి చూస్తే సెంచరీ చేస్తాడేమో అనిపించింది. కానీ భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు.
ఈ మ్యాచ్ లో మొత్తం 28 బంతులు ఎదుర్కొన్న ఈ స్టార్ ఆల్ రౌండర్ 5 సిక్సర్లు, 4 ఫోర్ల సహాయంతో 210.71 స్ట్రైక్ రేట్‌తో 59 పరుగులు చేశాడు. చాలా రోజలు తర్వాత యూవీ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. యువీ ధనాధన్ ఇన్నింగ్స్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
2000, 2007, 2011 and now 2024 🚀
Yuvi keeps his date with the Aussies in the Knockouts! 👊🏽#WCLonFanCode @YUVSTRONG12 pic.twitter.com/tjqtJJhnH4
— FanCode (@FanCode) July 12, 2024
కాగా ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఛాంపియన్‌లను ఇండియా ఛాంపియన్స్ 86 పరుగుల తేడాతో చిత్తు చేసింది. శనివారం (జులై 13) జరగనున్న ఫైనల్లో దాయాది పాకిస్తాన్‌తో భారత్ అమీ తుమీ తెల్చుకోనుంది.
Jhoome J̵o̵ Do Pathan 💪🎶
It rained sixes in the death overs courtesy Power Packed Pathan Performance™️#WCLonFanCode @iamyusufpathan @IrfanPathan pic.twitter.com/C7n3AiQpl7
— FanCode (@FanCode) July 12, 2024
You say intent, we say Robbie. ❤️
The opener has compiled a stroke-filled half-century off just 20 deliveries to give India Champions a flying start. 👏🏼#WCLonFanCode @robbieuthappa pic.twitter.com/zUNBPY5eWk
— FanCode (@FanCode) July 12, 2024
రాబిన్ ఉతప్ప (వికెట్ కీపర్), అంబటి రాయుడు, సురేష్ రైనా, యువరాజ్ సింగ్ (కెప్టెన్), యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, గురుకీరత్ సింగ్ మాన్, పవన్ నేగి, వినయ్ కుమార్, హర్భజన్ సింగ్, ధవల్ కులకర్ణి, రాహుల్ శుక్లా, ఆర్పీ సింగ్ , నమన్ ఓజా, సౌరభ్ తివారీ, అనురీత్ సింగ్, రాహుల్ శర్మ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..