Viral Video: సిక్స్ కొట్టిన బంతిని అందుకునేందుకు అభిమాని ప్రయత్నం.. తల పగిలి రక్తం..

క్రికెట్‌ మ్యాచ్‌లలో ఆటగాళ్లు బాదిన బంతులను అందుకోవడానికి మైదానంలో ఫీల్డర్లతో పాటు స్టేడియంలోని అభిమానులు కూడా ఎంతో తహతహలాడుతుంటారు

Viral Video: సిక్స్ కొట్టిన బంతిని అందుకునేందుకు అభిమాని ప్రయత్నం.. తల పగిలి రక్తం..
Follow us
Basha Shek

|

Updated on: Dec 14, 2021 | 10:30 PM

క్రికెట్‌ మ్యాచ్‌లలో ఆటగాళ్లు బాదిన బంతులను అందుకోవడానికి మైదానంలో ఫీల్డర్లతో పాటు స్టేడియంలోని అభిమానులు కూడా ఎంతో తహతహలాడుతుంటారు. అయితే వాటిని జాగ్రత్తగా పట్టుకుంటే పర్వాలేదు కానీ పట్టుజారితే మాత్రం గాయాల బారిన పడాల్సిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతోన్న బిగ్‌ బాష్‌ లీగ్‌( బీబీఎల్‌)- 2021లో అలాంటికర సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఓ బ్యాటర్‌ కొట్టిన భారీ సిక్స్‌ను క్యాచ్‌గా పట్టుకుందామని ప్రయత్నించి ఓ అభిమాని తీవ్రంగా గాయపడ్డాడు. ఏకంగా తల పగిలి రక్తం చిమ్మింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. లీగ్‌లో భాగంగా మంగళవారం హోబర్ట్‌ మైదానం వేదికగా పెర్త్‌ స్కార్చర్స్‌, హోబర్ట్‌ హరికేన్స్‌ జట్లు తలపడ్డాయి. హోబర్ట్‌ హరికేన్స్‌ ఇన్నింగ్స్‌ 8వ ఓవర్లో ఫాస్ట్‌ బౌలర్‌ ఆండ్రూ టై బౌలింగ్‌లో బెన్‌ మెక్‌డెర్మోట్‌ భారీ సిక్స్‌ కొట్టాడు. బంతి ఏకంగా స్టాండ్స్‌లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే స్టేడియంలో ఉన్న ఓ అభిమాని అత్యుత్సాహంతో బంతిని అందుకోవాలని ప్రయత్నించాడు. అయితే బంతి దురదృష్టవశాత్తూ అతని తల భాగంలో బలంగా తగిలింది. దీంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు. రక్తం రావడం చూసిన తోటి ప్రేక్షకులు కాస్త ఆందోళనకు గురయ్యారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు సమాచారం.

Also Read:

23 బంతుల్లో 106 పరుగులు.. 6గురి బౌలర్ల ఊచకోత.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన కోహ్లీ టీమ్‌మేట్.. ఎవరో తెలుసా!

IND vs SA: దక్షిణాఫ్రికాలో 1000+ పరుగులు.. లిస్టులో లిటిల్ మాస్టర్ ఒక్కడే.. ఒక్క సిక్స్ కొట్టని కోహ్లీ, ద్రవిడ్.. పూర్తి జాబితా ఇదే..!

IND Vs SA: రోహిత్ శర్మ సిరీస్‌కు దూరమవడం ఇండియాకు పెద్ద దెబ్బ.. యువకులు ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..