- Telugu News Photo Gallery Cricket photos Year Ender 2021: In a calendar year three players score most runs in 3 formats Rizwan, Rohit Sharma, Joe Root
3 ఫార్మాట్‌లు, 3 ప్లేయర్‌లు.. క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగుల జాబితాలో వీరే టాప్..!
Most Runs In Calendar Year: 2021 సంవత్సరంలో, ముగ్గురు వేర్వేరు ఆటగాళ్లు మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు సాధించిన లిస్టులో చేరారు. జో రూట్, మహమ్మద్ రిజ్వాన్, రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు.
Updated on: Dec 15, 2021 | 7:08 AM

ప్రస్తుత ఆటగాళ్లలో క్యాలండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులతో రికార్డులను సృష్టించిన ప్లేయర్లలో మూడు ఫార్మాట్లలో ముగ్గురు ఉన్నారు. టెస్ట్, వన్డే, టీ20లలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రస్తుత క్రికెటర్లలో ఎవరున్నారో తెలుసుకుందాం.

టెస్టుల్లో జో రూట్: ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ టెస్టు క్రికెట్ క్యాలెండర్ ఇయర్‌లో ప్రస్తుత క్రికెటర్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది జో రూట్ 2021 సంవత్సరంలో ఇప్పటివరకు 1544 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్‌లో రూట్ కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడితే, క్యాలెండర్ ఇయర్‌లో ఆల్ టైమ్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా మారే ఛాన్స్ ఉంది.

వన్డేల్లో రోహిత్: ఇక వన్డేల గురించి చెప్పాలంటే.. ప్రస్తుత క్రికెటర్లలో పరుగులు చేయడంలో రోహిత్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే పరుగులు చేసిన ఆటగాడిగా హిట్‌మ్యాన్ ఈ రికార్డును కలిగి ఉన్నాడు. 2019లో 1490 పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు.

టీ20లో రిజ్వాన్: ప్రస్తుత క్రికెటర్లలో టీ20లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ నిలిచాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు 1123 పరుగులు చేసి ఈ రికార్డు సృష్టించాడు.





























