AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs SA: రోహిత్ శర్మ సిరీస్‌కు దూరమవడం ఇండియాకు పెద్ద దెబ్బ.. యువకులు ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

ఓపెనర్ రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమవడం భారత్‎కు "భారీ దెబ్బ" అని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు...

IND Vs SA: రోహిత్ శర్మ సిరీస్‌కు దూరమవడం ఇండియాకు పెద్ద దెబ్బ.. యువకులు ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
Rohith Sharma
Srinivas Chekkilla
|

Updated on: Dec 14, 2021 | 11:04 AM

Share

ఓపెనర్ రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమవడం భారత్‎కు “భారీ దెబ్బ” అని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు రోహిత్ దూరమైనట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం ధృవీకరించింది. ” ఇది టీమిండియాకు పెద్ద దెబ్బ, అతను ఇంగ్లండ్‌లో బ్యాటింగ్ చేసిన విధానం, అతను మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు టెస్ట్ సిరీస్‎కు దూరమవుతున్నాడు.” అని గంభీర్ ANIతో అన్నారు.

రోహిత్ శర్మ స్థానంలో ప్రియాంక్ పాంచల్‌ను టెస్టు జట్టులోకి తీసుకున్నారు.” యువకులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేశం గర్వించేలా చేయడానికి గొప్ప అవకాశం” అని గంభీర్ పేర్కొన్నాడు. ఇటీవలే జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమితులైన రోహిత్ ఆదివారం ముంబైలో తన శిక్షణ సెషన్‌లో ఎడమ చేతికి గాయమైంది. మొదట రోహిత్ శర్మ టెస్టు సిరీస్‌కు దూరమైన తర్వాత విరాట్ కోహ్లీ వన్డే సిరీస్‌లో ఆడడని కూడా వార్తలు వస్తున్నాయి. వన్డే సిరీస్ నుంచి వైదొలగాలన్న తన నిర్ణయాన్ని విరాట్ బీసీసీఐకి కూడా తెలియజేశాడు.

దక్షిణాఫ్రికా టెస్టులకు భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ప్రియాంక్ పంచల్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్ (wk), వృద్ధిమాన్ సాహా (wk), R అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్.

Read Also..

VVS Laxman: ఎన్‎సీఏ హెడ్‌గా బాధ్యతలు చేపట్టిన వీవీఎస్ లక్ష్మణ్.. కొత్త సవాల్ అంటూ వ్యాఖ్యలు..