Teamindia New Skipper: కోహ్లీని రీప్లేస్ చేసే సత్తా.. ఈ యంగ్ ప్లేయర్‌దే..! యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియాకు కొత్త కెప్టెన్ అయ్యే సత్తా ఈ యంగ్ బ్యాట్స్‌మెన్‌కే ఉందని, కారణం అతని బుర్ర చాలా తెలివైనది అంటూ టీమిండియా మాజీ డాషింగ్ ప్లేయర్ యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.
Teamindia New Skipper: న్యూజిలాండ్ తో జరిగిన ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పోరులో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీని తరువాత కెప్టెన్‌ను మార్చాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. అప్పుడప్పుడూ ఇలాంటి చర్చలు వస్తున్నా.. ఈ సారి మాత్రం చాలా జోరుగా టీమిండియా నూతన కెప్టెన్ గురించి చర్చలు నడుస్తున్నాయి. ఈ లిస్టులో చాలామంది హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పేరును ప్రస్తావిస్తున్నారు. మరికొంత మంది పలువురు సీనియర్ ప్లేయర్ల పేర్లను సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ డాషింగ్ ప్లేయర్ యువరాజ్ సింగ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు కొత్త కెప్టెన్ కావాలా నాయనా.. ఇదిగో ఆ సత్తా ఈ యంగ్ బ్యాట్స్‌మెన్‌కే ఉందని, ఎందుకంటే అతని బుర్ర చాలా తెలివైనది అంటూ తన మనసులోని మాటను చెప్పేశాడు. టీమిండియా యంగ్ బ్యాట్స్‌మెన్, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్.. భారత్ భవిష్యత్తు నాయకుడిగా కనిపిస్తున్నాడని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. ఇప్పటికే ఈ యంగ్ ప్లేయర్ తానొక మ్యాచ్ విన్నర్ అని రుజువుచేసుకున్నాడని తెలిపాడు.
‘మునుపటితో పోలిస్తే ప్రస్తుత రిషభ్ పంత్ లో చాలా మార్పు కనిపిస్తోందని, కఠినమైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి పరిస్థితుల్లో అద్భుతంగా ఆడడం మనం చూసే ఉన్నాం. మిడిలార్డర్ లో రిషభ్ పంత్ చాలా కీలక ప్లేయర్‌గా మారాడు. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అతడు ఔటైన తీరుపై చాలామంది విమర్శిస్తున్నారు. ఇది సరైంది కాదు’ అని యువీ తెలిపాడు.
‘రిషభ్ పంత్.. గిల్‌క్రిస్ట్ లాంటి ప్లేయర్ అని, ఇలాంటి వారు మ్యాచులను ఏ క్షణంలోనైనా మలుపు తిప్పేస్తుంటారు. టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా ప్లేయర్ క్రీజులోకి వస్తే పరిస్థితి మరోలా మారిపోయేది. ప్రస్తుతం రిషభ్ కూడా అలాగే కనిపిస్తున్నాడు. సిడ్నీలో 118 బంతుల్లో 97 పరుగులు, బ్రిస్బేన్‌లో 138 బంతుల్లో 89* పరుగులతో అజేయంగా నిలిచాడు’ అని యువరాజ్ అన్నాడు.
రిషభ్ పంత్ లో టీమిండియా ఫ్యూచర్ కప్టెన్ కనిపిస్తున్నాడని, మైదానంలో చురుకుగా ఉంటాడని యువరాజ్ చెప్పుకొచ్చాడు. అందరితో మాట్లాడుతూ.. సందడి చేస్తాడని, రిషబ్‌ది తెలివైన బుర్ర అని ప్రశంసించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ను నడిపిస్తున్న తీరును చూస్తే.. అతడే భారత్‌కు భవిష్యత్తు కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని వెల్లడించాడు.
Also Read:
Tokyo Olympics: అనుకున్నదే జరిగింది.. జపాన్‌లో ఎమర్జెన్సీ.. ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్!
Wimbledon 2021: మహిళల సింగిల్స్‌లో కొత్త ఛాంపియన్‌కే అవకాశం.. ఫైనల్ చేరిన ఆష్లే బార్టీ, ప్లిస్కోవా!