కొత్త సంవత్సరంలో మరికొంత మంది క్రికెటర్లు తమ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. 2022లో మొత్తం 11 మంది క్రికెటర్లు తమ జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టారు. తమ ప్రియురాలు/ప్రియుడుతో కలిసి రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఇందులో టీమిండియా క్రికెటర్లు కూడా ఉన్నారు. ఇక కొందరు విదేశీ క్రికెటర్లు భారతీయ అమ్మాయిలతో ఏడడుగులు నడిచారు. మరికొందరు తమతో చదువుతున్న అమ్మయిలనే జీవిత భాగస్వామిగా ఎంచుకున్నారు. కొందరు 34 ఏళ్ల వయసులో పెళ్లికొడుకుగా మారగా, మరికొందరు 66 ఏళ్ల వయసులో వరుడిగా మారారు. 2022 సంవత్సరం మరికొన్ని రోజుల్లో ముగియనుంది కాబట్టి ఈ ఏడాది పెళ్లి చేసుకున్న 11 మంది క్రికెటర్ల గురించి తెలుసుకుందాం రండి.
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్ ఇటీవలే తన క్లాస్‌మేట్‌తో కలిసి నిఖా చేసుకున్నాడు. ఇస్లామాబాద్ వేడుకగా జరిగిన హరీస్ వివాహానికి పలువురు పాకిస్థాన్ క్రికెటర్లు హాజరయ్యారు.
ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఈ ఏడాది మార్చిలో భారత సంతతికి చెందిన వినీ రామన్‌ను వివాహం చేసుకున్నాడు. మొదట ఆస్ట్రేలియా వేదికగా పెళ్లిపీటలెక్కిన ఈ లవ్‌బర్డ్స్ ఆ తర్వాత మార్చి 27 న ఇండియాలో మళ్లీ వివాహం చేసుకున్నారు. దక్షిణ భారతీయ సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది.
టీమిండియా పేసర్ దీపక్ చాహర్ తన ప్రేయసి జయభరద్వాజ్‌తో కలిసి ఈ ఏడాదే పెళ్లిపీటలెక్కాడు. ఆగ్రా వేదికగా జరిగిన ఈ వివాహానికి ఎంఎస్ ధోనీతో పాటు ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, శిఖర్ ధావన్ కూడా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
కేథరీన్ బ్రంట్‌తో నేట్ సీవర్
Our warmest congratulations to Katherine Brunt & Nat Sciver who got married over the weekend ❤️ pic.twitter.com/8xgu7WxtFW
— England Cricket (@englandcricket) May 30, 2022
ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టుకు చెందిన ఈ ఇద్దరు క్రీడాకారిణులు 30 మే 2022న వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరు గత ఐదేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు.
అరుణ్ లాల్‌తో బుల్ బుల్
టీమిండియా వెటరన్ క్రికెటర్ అరుణ్ లాల్ 66 ఏళ్ల వయసులో రెండోసారి వరుడిగా మారి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కోల్‌కతాలో లాల్ తన స్నేహితురాలు బుల్బుల్ సాహాను వివాహం చేసుకున్నాడు. ఆశ్చర్యకరంగా, అతని మాజీ భార్య రీనా కూడా ఈ వివాహానికి అంగీకరించింది.
చరిత్ అసలంక, పథం నిస్సాంక, కసున్ రజిత
Congratulations to Charith Asalanka, Pathum Nissanka and Kasun Rajitha! ?? pic.twitter.com/qlUZKtOMVG
— Sri Lanka Cricket ?? (@OfficialSLC) November 28, 2022
ఈ ముగ్గురు శ్రీలంక క్రికెటర్లు ఒకే రోజు అంటే 28 నవంబర్ 2022న వివాహం చేసుకున్నారు. టీ20 ప్రపంచకప్ ఆడి ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి వచ్చిన వెంటనే ముగ్గురూ పెళ్లి చేసుకున్నారు.
జిమ్మీ నీషమ్‌తో అలెక్స్ మెక్‌లియోడ్ స్మిత్
న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నీషమ్ తన చిరకాల భాగస్వామి అలెక్స్ మెక్‌లియోడ్ స్మిత్‌ను డిసెంబర్ మొదటి వారంలో వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత వెంటనే బిగ్‌బాష్‌లో ఆడేందుకు వెళ్లాల్సి రావడంతో నీషమ్ హనీమూన్ క్యాన్సిల్ చేసుకున్నాడు.
రాహుల్ శర్మ
టీమిండియా మాజీ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రాహుల్ శర్మ డిసెంబర్ 8న తన ప్రేయసితో కలిసి పెళ్లిపీటలెక్కాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..