మహిళల ప్రీమియర్ లీగ్ సెకెండ్ సీజన్ కోసం ముంబై వేదికగా శనివారం (డిసెంబర్ 9) మినీ వేలం జరుగుతోంది. అయితే ఈ ప్రీమియర్ బిడ్డింగ్‌లో కొంతమంది స్టార్ ప్లేయర్లు, సీనియర్ ఆటగాళ్లను తీసుకోవడానికి ఫ్రాంఛైజీలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అదే సమయంలో యంగ్ ప్లేయర్ల కోసం లక్షలు, అవసరమైతే కోట్లు కూడా వెచ్చిస్తున్నాయి. తాజాగా మహిళల ప్రీమియర్ లీగ్‌లో తెలంగాణ అమ్మాయికి జాక్ పాట్ తగిలింది. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు చెందిన త్రిష పూజితను రూ. 10 లక్షలతో గుజరాత్ జెయింట్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న ఆమె హైదరాబాద్‌లోనే శిక్షణ పొందింది. అండర్-16, 19, 23 విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసింది. హైదరాబాద్ టీమ్ తరఫున కొన్ని మ్యాచ్‌లు కూడా ఆడింది. ఇప్పుడు ఏకంగా మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆడే అవకాశం దక్కించుకుంది. ఈక్రమంలో డబ్ల్యూపీఎల్ త్రిష గొప్పగా ఆడి జాతీయ జట్టుకు ఎంపిక కావాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.
కాగా ఇదే వేలంలో మరో యువ ప్లేయర్ బృందా దినేష్‌ను 1.30 కోట్లకు కొనుగోలు చేసింది యూపీ వారియర్స్. రూ. 10 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఆమె కోసం మొదట ఆర్సీబీ రూ. 15 లక్షల బిడ్డింగ్ వేసింది. అయితే ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ ఆర్సీబీ లెక్కలను తలకిందులు చేశాయి. ముఖ్యంగా కర్ణాటక యువ క్రీడాకారిణిని కొనుగోలు చేసేందుకు యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ బాగా పోటీ పడ్డాయి. దీంతో బృందా దినేష్ నికర విలువ ఒక్కసారిగా కోటి రూపాయలకు చేరుకుంది. చివరకు యూపీ వారియర్స్ ఈ యంగ్ క్రికెటర్‌ను1.30 కోట్లకు కొనుగోలు చేసింది.
More additions 2️⃣ our 𝐆𝐢𝐚𝐧𝐭 squad. 🔥
Priya Mishra and Trisha Poojitha join us for ₹20 lac & ₹10 lac respectively. #TATAWPLAuction #Cricket #BringItOn #Adani pic.twitter.com/Y7et4Px3Fu
— Gujarat Giants (@Giant_Cricket) December 9, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..