WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్‌ ప్రారంభోత్సవంలో సినిమా తారలు.. ఎవరెవరురానున్నారంటే?

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) రెండో సీజన్ ఫిబ్రవరి 23న ప్రారంభమవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ప్రారంభ మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం ఈ హై-వోల్టేజ్ పోరుకు ఆతిథ్యం ఇస్తోంది.

WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్‌ ప్రారంభోత్సవంలో సినిమా తారలు.. ఎవరెవరురానున్నారంటే?
WPL 2024

Updated on: Feb 20, 2024 | 1:19 PM

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) రెండో సీజన్ ఫిబ్రవరి 23న ప్రారంభమవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ప్రారంభ మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం ఈ హై-వోల్టేజ్ పోరుకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు, బిసిసిఐ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకను నిర్వహించింది, ఇందులో కొంతమంది బాలీవుడ్ తారలు కనిపిస్తారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ప్రముఖ నటుడు కార్తీక్ ఆర్యన్ ప్రారంభ వేడుకలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ప్రారంభోత్సవ వేడుక ఫిబ్రవరి 23 సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. కార్తీక్ ఆర్యన్‌తో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ ఇందులో కనిపిస్తారు. చివరిసారి కియారా అద్వానీ కృతి సనన్ వంటి అందాల తారలు డబ్ల్యూపీఎల్‌ ప్రారంభ వేడుకలో ప్రదర్శనలు ఇచ్చారు. అదే సమయంలో, గాయకుడు ఏపీ ధిల్లాన్ తన పాటలతో క్రికెట్‌ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.

 

ఇవి కూడా చదవండి

డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 17 వరకు జరగనుంది. గతేడాది మాదిరిగానే మొత్తం ఐదు జట్లు 22 మ్యాచ్‌లు ఆడనున్నాయి. కానీ, ఈసారి పెద్ద మార్పు వచ్చింది. నిజానికి గత ఏడాది ఈ లీగ్‌ని ముంబై, నవీ ముంబై అనే రెండు స్టేడియంలలో నిర్వహించారు. అయితే ఈసారి ఈ లీగ్ హోస్టింగ్‌ను ముంబైకి బదులుగా బెంగళూరు, ఢిల్లీలో నిర్వహించనున్నారు.

ఢిల్లీలో ఫైనల్ మ్యాచ్

టోర్నీలో తొలి 11 మ్యాచ్‌లు బెంగళూరులో జరగనున్నాయి. దీని తరువాత, మొత్తం ఐదు జట్లు ఢిల్లీకి వెళ్తాయి, అక్కడ ఎలిమినేటర్‌తో సహా చివరి మ్యాచ్ జరగనుంది. లీగ్ రౌండ్‌లో 20 మ్యాచ్‌లు, ఎలిమినేటర్. ఫైనల్ మ్యాచ్‌లు ఉంటాయి. లీగ్ రౌండ్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్స్‌లోకి ప్రవేశిస్తుంది. అయితే రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌ను ఆడతాయి. 24 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో ఒక్క డబుల్ హెడర్ మ్యాచ్ కూడా ఉండదు. ప్రతి రోజు ఒక మ్యాచ్ మాత్రమే ఆడతారు. ఎలిమినేటర్ మ్యాచ్ మార్చి 15న, ఫైనల్ మార్చి 17న ఢిల్లీలో జరగనుంది

సిద్ధార్థ్ మల్హోత్రా..

కార్తీక్ ఆర్యన్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..