WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. భారతదేశంలో మొదటిసారిగా ప్రారంభమైన మహిళల టీ20 లీగ్ మొదటి సీజన్, ఒక అద్భుతమైన ప్రారంభ వేడుకతో మొదలైంది. ఇందులో బాలీవుడ్ తారలు సూపర్ హిట్ పంజాబీ పాటలకు డ్యాన్స్ చేశారు. మార్చి 4 శనివారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో టోర్నమెంట్‌లోని మొదటి మ్యాచ్‌కు ముందు పంజాబీ పాప్‌స్టార్ ఏపీ ధిల్లాన్ తన బ్లాక్‌బస్టర్ పాటలతో అభిమానులను ఉర్రూతలూగించగా.. కియారా అద్వానీ, కృతి సనన్ తమ డ్యాన్స్ మూమెంట్లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.