Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023: ‘మోదీ మైదానంలో భారత్-పాక్ మ్యాచ్, ఒక రాజకీయ కుట్ర’.. పీసీబీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..

IND vs PAK, World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్నట్లు వస్తున్న వార్తలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజమ్ సేథీ స్పందించాడు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌ను వేదికగా ఎంపిక చేస్తున్నారని..

World Cup 2023: ‘మోదీ మైదానంలో భారత్-పాక్ మ్యాచ్, ఒక రాజకీయ కుట్ర’.. పీసీబీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
Ind Vs Pak, Odi Wc 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 12, 2023 | 6:13 PM

IND vs PAK, World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్నట్లు వస్తున్న వార్తలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజమ్ సేథీ స్పందించాడు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌ను వేదికగా ఎంపిక చేస్తున్నారని సేథీ ఆరోపించాడు. ఆసియాకప్ 2023 కోసం పాకిస్థాన్‌కు రాలేమని భారత్ చెప్పడం ఇరు దేశాల ఐసీసీ టోర్నీ మ్యాచ్‌లపై ప్రభావం చూపుతుందని, భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌తో పాటు పాకిస్థాన్ వేదికగా జరగనున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీ‌లో దాయాదీ దేశాలకు ఇబ్బంది అవుతుందని అభిప్రాయపడ్డాడు.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ‘‘ఆసియాకప్ 2023ను భారత్ తటస్థ వేదికగా ఆడాలనుకుంటే.. మేము ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరిస్తేనే పాకిస్తాను కూడా వన్డే ప్రపంచకప్ కోసం అదే హైబ్రిడ్ కాన్సెప్ట్ కావాలని డిమాండ్ చేస్తాం. ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లను బంగ్లాదేశ్‌లోని ఢాకా లేదా భారత్ ఆమోదించిన బయటి వేదికల్లో ఆడించాలని కోరుతాం. పాక్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఇదే పద్దతిని తప్పక కొనసాగిస్తాం. ఫలితంగా ఇరు దేశాల మధ్య ఉన్న రాజకీయ ప్రతిష్టంభనను అధిగమించవచ్చు. క్రికెట్ పరంగా ఇరుదేశాల సత్సంబంధాలు పెంచుకునేందుకు ఇది మంచి వ్యూహం. ఇతర దేశాలు ఎలాగో పాక్‌‌కు వచ్చి ఆడేందుకు సుముఖంగానే ఉన్నాయ’’ని పేర్కొన్నాడు సేథీ.

ఇంకా ‘‘వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదికను ఖరారు చేసినట్లు వస్తున్న వార్తలు విన్నాను. ఇది తెలిసిన తర్వాత నవ్వుకున్నాను. భారత్‌కు పాకిస్థాన్ టీమ్ కాకూడదనే ఇలా చేస్తున్నారని నాలో నేను అనుకున్నా. కోల్‌కతా, చెన్నై వేదికగా మ్యాచ్‌లు జరుపుతారంటే దానికి ఓ అర్థం ఉంటుంది. నేను రాజకీయాల జోలికి పోవాలనుకోవడం లేదు. కానీ అహ్మదాబాద్ వేదికగా భారత్-పాక్ మ్యాచ్ అంటేనే రాజకీయ కోణం ఉందనే విషయం స్పష్టం అర్థమవుతోంది. ఎందుకంటే మాకు భద్రతా పరంగా సమస్యలున్న ఏకైక ప్రాంతం అది’’ అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

అలాగే ‘‘అహ్మదాబాద్‌ వేదిక గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అహ్మదాబాద్‌లో మిమ్మల్ని ఆడించబోతున్నాం, కాబట్టి మీకు మీరు జాగ్రత్తగా ఉండండని ముందుగనానే మాకు చెప్పినట్లు ఉంది ఇది. అహ్మదాబాద్‌ను ఎవరు పాలిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు’’ అంటూ ఈ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించాడు పీసీబీ చీఫ్ సేథీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..