Video: గిల్ తొలి సెంచరీ మిస్.. వైరలవుతోన్న సారా టెండూల్కర్ రియాక్షన్.. వీడియో
Sara Tendulkar - Shubman Gill: ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌లో శుభ్‌మాన్ గిల్ తన మొదటి సెంచరీకి కేవలం 8 పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు. అయితే, ఈ అద్భుత ఇన్నింగ్స్‌కు జనాలు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఇందులో సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

Sara Tendulkar’s Reaction On Shubman Gill: ప్రపంచకప్‌లో శ్రీలంకకు 358 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. గురువారం వాంఖడే స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 357 పరుగులు చేసింది. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా తొలిసారి 350+ పరుగులు చేసింది.
భారత్ తరపున శుభ్‌మన్ గిల్ 92 పరుగులు, విరాట్ కోహ్లీ 88 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక 5 వికెట్లు తీశాడు. దుష్మంత చమీరకు ఒక వికెట్ దక్కింది.
అయితే, ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సెంచరీ కేవలం 8 పరుగుల తేడాతో కోల్పోయాడు. గిల్ ఇన్నింగ్స్ 92 పరుగుల వద్ద ముగిసింది. గిల్ 90కి పైగా స్కోర్ చేసిన తర్వాత సెంచరీని అందుకోలేక పోవడం ఇదే తొలిసారి. స్టేడియంలో ఉన్న అభిమానులు గిల్ ఔట్ కావడంతో చాలా నిరాశ చెందారు. అదే సమయంలో, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా షాకైంది.
దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో శుభమాన్ గిల్ ఔట్ అయిన తర్వాత సారా టెండూల్కర్ ఆశ్చర్యకరమైన స్పందన కనిపించింది. ఇన్నింగ్స్ 30వ ఓవర్ చివరి బంతికి దిలాషన్ మధుశంక బౌలింగ్‌లో గిల్ అవుటయ్యాడు. గిల్ తన ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌కు ఫిదా అయిన ప్రేక్షకులు పెవిలియన్‌కు చేరే సమయంలో స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అయితే, సారా టెండూల్కర్ కూడా గిల్‌కు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. గిల్‌కి సారా స్టాండింగ్ ఒవేషన్ ఇస్తున్న ఫొటో కూడా వైరల్ అవుతోంది.
Sara Tendulkar. 💔😭 #ShubmanGill #INDvsSL pic.twitter.com/xjcfcjIRN3
— Atishay Jain (@AtishayyJain96) November 2, 2023
శుభ్‌మన్ గిల్ అంతకుముందు పూణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 53 పరుగుల ఇన్నింగ్స్ ఆడి వన్డే ప్రపంచ కప్‌లో తన మొదటి అర్ధ సెంచరీని నమోదు చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో సారా టెండూల్కర్ కనిపించింది.
ఏడో మ్యాచ్ ఆడుతోన్న టీమిండియా..
టోర్నీలో ఇప్పటివరకు అజేయంగా నిలిచిన టీమ్ ఇండియా.. వన్డే ప్రపంచకప్ 2023 లో ఏడో మ్యాచ్‌ని శ్రీలంకతో ఆడుతోంది . టోర్నీలో ఇప్పటివరకు ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోని ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. గత 6 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లను భారత్ ఓడించింది. రోహిత్ బ్సేన 6 మ్యాచ్‌లలో 5 మ్యాచ్‌ల్లో పరుగులను ఛేజింగ్ చేయడం ద్వారా, ఒక మ్యాచ్‌లో డిఫెండింగ్ చేసి గెలిచింది.