
ICC World Cup 2023: భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో క్రికెట్ మైదానంలో నమాజ్ చేసినందుకు పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో ఫిర్యాదు నమోదైంది. భారత సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ఉన్న ఫిర్యాదుదారు వినీత్ జిందాల్ ఐసీసీకి లేఖ రాశారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు.
అక్టోబర్ 6న హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేశాడు. ఈ విషయమై వినీత్ జిందాల్ ఇప్పుడు ఐసీసీ అధ్యక్షుడు గ్రెగ్ బార్క్లేకు ఫిర్యాదు చేశారు.
‘‘క్రికెట్ మైదానంలో మహమ్మద్ రిజ్వాన్ నమాజ్ చేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. ఇది ఉద్దేశపూర్వకంగా మతపరమైన చిత్రీకరణకు సంకేతం’ అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
పాకిస్థాన్ ఆటగాడి ఈ చర్య అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. తన మతాన్ని ప్రదర్శించడం ద్వారా, మహ్మద్ రిజ్వాన్ ఉద్దేశపూర్వకంగా ముస్లిం అనే సందేశాన్ని ఇస్తున్నాడు. ఇది క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసే ఆలోచన అంటూ అంతులో పేర్కొన్నారు.
Muhammad Rizwan offered Namaz in Hyderabad ground ❤️🤲#WorldCup – #WorldCup2023 – #PAKvNED – #BabarAzam – #WorldCup2023 #CWC23 pic.twitter.com/rQhza4M794
— World Cup 🏏 (@MensWorldCup23) October 6, 2023
విరామ సమయంలో అతని సహచరులు డ్రింక్స్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు రిజ్వాన్ మైదానం మధ్యలో ప్రార్థన చేస్తూ కనిపించాడు. ఇలాంటి ఎత్తుగడలను అనుమతించరాదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతేకాదు, శ్రీలంకపై మహ్మద్ రిజ్వాన్ తన సెంచరీని గాజా ప్రజలకు అంకితం చేశాడు. ఇది కూడా వివాదానికి దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ తన ఫిర్యాదులో ఈ అంశాన్ని లేవనెత్తారు.
పాకిస్తాన్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు మ్యాచ్‌లు గెలిచి, ఒకదాంట్లో ఓడిపోయింది. ప్రస్తుతం పాకిస్తాన్ టీం ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. అలాగే నెట్ రన్ రేట్ విషయానికి వస్తే మైనస్ 0.137గా నిలిచింది. రేపు అనగా 18న ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్ ఆడనుంది.
పాకిస్థాన్ జట్టు: ఇమామ్-ఉల్-హక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(కీపర్), ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హరీస్ రవూఫ్, మహ్మద్ వసీం జూనియర్, షాహీన్ అఫ్రిది, సౌద్ షకీల్, అఘా సల్మాన్, ఉసామా మీర్, అబ్దుల్లా షఫీక్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..