ఈ బామ్మకు ఫ్యానైన విరాట్..మ్యాచ్ చూసేందుకు రమ్మంటూ ఆహ్వానం

వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆడియెన్స్ గ్యాలరీలో ఎంతో ఉత్సాహంతో టీమిండియాకు మద్దతిచ్చి సూపర్ ఫ్యాన్ గా పేరొందిన 87 ఏళ్ల వృద్ధమహిళ చారులతకు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన కానుక ఇచ్చాడు. తొమ్మిది పదుల వయస్సు దగ్గరపడుతున్నప్పటికీ వీల్ చైర్ లో స్టేడియంకు వచ్చి ఈ బామ్మ టీమిండియాకు ఛీర్స్ చెప్పిన తీరు భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మనసును హత్తుకుంది. మ్యాచ్ అనతరం కోహ్లి, రోహిత్ శర్మ ఆమె నుంచి […]

  • Ram Naramaneni
  • Publish Date - 9:52 pm, Sat, 6 July 19
ఈ బామ్మకు ఫ్యానైన విరాట్..మ్యాచ్ చూసేందుకు రమ్మంటూ ఆహ్వానం

వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆడియెన్స్ గ్యాలరీలో ఎంతో ఉత్సాహంతో టీమిండియాకు మద్దతిచ్చి సూపర్ ఫ్యాన్ గా పేరొందిన 87 ఏళ్ల వృద్ధమహిళ చారులతకు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన కానుక ఇచ్చాడు. తొమ్మిది పదుల వయస్సు దగ్గరపడుతున్నప్పటికీ వీల్ చైర్ లో స్టేడియంకు వచ్చి ఈ బామ్మ టీమిండియాకు ఛీర్స్ చెప్పిన తీరు భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మనసును హత్తుకుంది. మ్యాచ్ అనతరం కోహ్లి, రోహిత్ శర్మ ఆమె నుంచి బ్లెస్సింగ్స్ తీసుకున్న విషయం తెలిసిందే.

లీడ్స్ లో శ్రీలంకతో జరిగే మ్యాచ్ కు సైతం బామ్మ హాజరై వీక్షించాలని, ఆమెతో పాటు వారి కుటుంబ సభ్యులందరికీ టిక్కెట్లు పంపి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తమలో ఎంతో స్ఫూర్తిని నింపిన బామ్మ వారి కుటుంబ సభ్యులతో కలిసి చూస్తే తమకు సంతోషంగా ఉంటుందని కోహ్లీ ఓలేఖలో పేర్కొనడం విశేషం.