అఫ్గాన్‌పై బంగ్లా సూపర్ విక్టరీ

ఈ ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది బంగ్లాదేశ్. భారత్ లాంటి బలమైన జట్టును ఓడించినంత పని చేసిన పసికూన అఫ్గాన్‌పై సూపర్ విక్టరీ సాధించింది. సోమవారం సౌథాంఫ్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా 62 పరుగుల తేడాతో అఫ్గాన్‌పై అలవోకగా విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ముష్ఫికర్‌ రహీమ్‌(83), షకిబుల్ హసన్‌(51) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 262 పరుగులు చేసింది. […]

అఫ్గాన్‌పై బంగ్లా సూపర్ విక్టరీ
Follow us

|

Updated on: Jun 25, 2019 | 6:12 AM

ఈ ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది బంగ్లాదేశ్. భారత్ లాంటి బలమైన జట్టును ఓడించినంత పని చేసిన పసికూన అఫ్గాన్‌పై సూపర్ విక్టరీ సాధించింది. సోమవారం సౌథాంఫ్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా 62 పరుగుల తేడాతో అఫ్గాన్‌పై అలవోకగా విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ముష్ఫికర్‌ రహీమ్‌(83), షకిబుల్ హసన్‌(51) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 262 పరుగులు చేసింది. అటు అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్‌ రెహ్మాన్‌ (3/39) కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి.. బంగ్లా భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు.

అనంతరం లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన అఫ్గాన్‌ను… షకిబ్‌ (5/29), ముస్తాఫిజుర్‌ (2/32)లు గట్టి దెబ్బ తీయడంతో ఆ జట్టు 47 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ గుల్బాదిన్‌ నైబ్‌ (47), షెన్వారి (49) మాత్రమే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడారు. షకిబుల్ హాసన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. ఇప్పటివరకు టోర్నీలో ఏడు మ్యాచ్‌లాడిన బంగ్లాదేశ్‌కు ఇది మూడో విజయం. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.

దృశ్యం సినిమాను తలపిస్తున్న వడ్డే ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..?
దృశ్యం సినిమాను తలపిస్తున్న వడ్డే ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..?
మల్లీశ్వరి సినిమాకు కత్రినా ఎంత రెమ్యునరేషన్ అందుకుందో తెలుసా..
మల్లీశ్వరి సినిమాకు కత్రినా ఎంత రెమ్యునరేషన్ అందుకుందో తెలుసా..
సిక్సర్ల సునామీతో రెచ్చిపోయిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్..
సిక్సర్ల సునామీతో రెచ్చిపోయిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్..
కొవ్వు మంచిదే.. ఈ 4 ఆహారాలు శరీరానికి బ్రహ్మాస్త్రాలు..
కొవ్వు మంచిదే.. ఈ 4 ఆహారాలు శరీరానికి బ్రహ్మాస్త్రాలు..
చిన్న సమస్యకే కలత చెందుతున్నారా? మానసికంగా దృఢంగా ఉండాలంటే..
చిన్న సమస్యకే కలత చెందుతున్నారా? మానసికంగా దృఢంగా ఉండాలంటే..
డ్రై స్కిన్ కారణంగా వయసు కన్నా ముందుగానే వృద్ధాప్యం..!
డ్రై స్కిన్ కారణంగా వయసు కన్నా ముందుగానే వృద్ధాప్యం..!
కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ప్రధాని మోదీ
కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ప్రధాని మోదీ
రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా