Womens World Cup 2022: ఓటమితో మారిన టీమిండియా లెక్కలు.. సెమీఫైనల్ చేరేందుకు అవకాశాలు ఎలా ఉన్నాయంటే?
England Women vs India Women: ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన టీమిండియా ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో పడింది. ప్రపంచ కప్‌లో భారత్‌కు మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
మహిళల ప్రపంచ కప్ 2022(Womens World Cup 2022) లో, భారత జట్టు బుధవారం ఇంగ్లండ్ (England Women vs India Women) తో జరిగిన మ్యాచులో ఓడిపోయింది. మౌంట్ మౌంగానుయ్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కేవలం 136 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టోర్నీలో ఇంగ్లండ్ తొలి విజయాన్ని నమోదు చేయగా, భారత్ నాలుగు మ్యాచ్‌లు ఆడగా రెండింటిలో ఓడిపోయింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడం టీమిండియాకు చాలా భారంగా మారింది. ఎందుకంటే టీమిండియాకు ఇంకా మూడు లీగ్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే సమస్య ఏమిటంటే దాని రెండు మ్యాచ్‌లు టోర్నమెంట్‌లోని అత్యుత్తమ జట్లకు చెందినవి కావడం గమనార్హం. ఫామ్‌లో లేని ఇంగ్లండ్‌ను భారత జట్టు ఓడించి ఉంటే.. సెమీఫైనల్‌కు చేరాలనే అవకాశాలు మరింత బలపడి ఉండేది.
సెమీఫైనల్‌కు చేరుకోవడానికి టీమ్‌ఇండియా ఎందుకు కష్టపడాల్సి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. పాయింట్ల పట్టిక పరిస్థితిని ఓసారి పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఆస్ట్రేలియా 4 మ్యాచ్‌ల్లో 4 గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి రెండో స్థానంలో ఉంది. 2 మ్యాచ్‌లలో 4 పాయింట్లు, మెరుగైన రన్ రేట్ +0.632 కారణంగా భారత జట్టు మూడవ స్థానంలో ఉంది. అదే సమయంలో, న్యూజిలాండ్, వెస్టిండీస్ కూడా 4 పాయింట్లను కలిగి ఉన్నాయి. ఈ రెండు జట్లు నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.
సెమీఫైనల్ చేరాలంటే భారత జట్టు ఏం చేయాలి?
సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే భారత జట్టు అత్యుత్తమ క్రికెట్ ఆడాల్సి ఉంటుంది. మిగిలిన మూడు మ్యాచ్‌లను గెలవడం ద్వారా 10 పాయింట్లను పొందాల్సి ఉంటుంది. కానీ, అలా జరగకపోతే కనీసం 2 మ్యాచ్‌లు గెలవడంతో పాటు నెట్ రన్ రేట్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే, ఇక్కడ ఇబ్బంది ఏమిటంటే, టీమ్ ఇండియా తన తదుపరి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడవలసి ఉంది. ఆ తరువాత బలహీనమైన బంగ్లాదేశ్‌తో తలపడవలసి ఉంది. అయితే చివరి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌కు రెండు మ్యాచ్‌లు సవాల్‌గా మారడంతో రెండింటిలోనూ ఓడిపోతే సెమీఫైనల్‌కు చేరుకోవాలనే ఆశలు సన్నగిల్లే ఛాన్స్ ఉంటుంది.
న్యూజిలాండ్-వెస్టిండీస్ పెద్ద ముప్పు..
న్యూజిలాండ్‌కు ఇంకా 3 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. తదుపరి మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, పాకిస్థాన్‌లతో తలపడాల్సి ఉంది. దక్షిణాఫ్రికా టీం ఇంగ్లాండ్, పాకిస్తాన్‌లను ఓడించగలదు. ఇంగ్లండ్ జట్టు కూడా ప్రస్తుతం పటిష్టంగా ఉంది.
వెస్టిండీస్‌కు కూడా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వాటిలో రెండు మ్యాచ్‌లు వారికి సులువుగా చెప్పవచ్చు. ఈ టోర్నీలో బలహీన జట్లలో ఒకటైన బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లతో విండీస్ తలపడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లను భారీ తేడాతో గెలిస్తే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంటుంది. మరోవైపు దక్షిణాఫ్రికాపై ఓడినా ఆ జట్టు భారత్‌పైనే నిలదొక్కుకోగలదు. ఇక ఇంగ్లండ్ గురించి చెప్పాలంటే.. తన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. అప్పుడే ఆమె 8 పాయింట్లను చేరుకోగలదు. ఇంగ్లండ్ ఈ ఘనత సాధిస్తే నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీఫైనల్ జట్లను ఖరారు చేసే అవకాశం ఉంది.