AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్తాన్‌తోపాటు 3 జట్లు ఔట్.. రేసులో 9 టీంలు.. మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్ లెక్కలు ఇవే..?

Team India Semifinal Scenarios: మహిళల టీ20 ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్ ఇప్పుడు నాకౌట్ సమరాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా భారత జట్టు ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్టును ఓడించి సెమీస్‌కు దూసుకుపోవాలని కోట్లాది మంది అభిమానులు ఆశిస్తున్నారు. సమరానికి సమయం ఆసన్నమైంది, మరి మన భారత నారీమణులు ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో చూడాలి.

పాకిస్తాన్‌తోపాటు 3 జట్లు ఔట్.. రేసులో 9 టీంలు.. మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్ లెక్కలు ఇవే..?
Womens T20 World Cup 2026
Venkata Chari
|

Updated on: Jun 22, 2026 | 9:08 PM

Share

Women’s T20 World Cup 2026 Semifinals: మహిళల టీ20 ప్రపంచకప్ 2026 రసవత్తర ఘట్టానికి చేరుకుంది. ఇంగ్లాండ్ వేదికగా సాగుతున్న ఈ మెగా టోర్నీలో ఇప్పటికే లీగ్ దశలో 18 కీలక మ్యాచ్‌లు ముగిశాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టుకు మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండటంతో సెమీఫైనల్ రేసు క్లైమాక్స్‌కు చేరింది. పాకిస్తాన్ సహా మూడు జట్లు ఇప్పటికే ఇంటిబాట పట్టగా, మిగిలిన 9 జట్ల మధ్య సెమీస్ పోరు ఉత్కంఠ రేపుతోంది.

పాక్ అవుట్.. ఆ మూడు జట్లకు నిరాశే..!

ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో గ్రూప్-ఎ నుంచి పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లు సెమీఫైనల్ రేసు నుంచి అధికారికంగా తప్పుకున్నాయి. అటు గ్రూప్-బి నుంచి ఐర్లాండ్ జట్టు కూడా లీగ్ దశలోనే తన ప్రయాణాన్ని ముగించింది. ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఘోర పరాజయాలు చవిచూడటంతో ఈ మూడు జట్ల ప్రపంచకప్ కల చెదిరిపోయింది. ఇక మిగిలిన తొమ్మిది జట్లకు ప్రతి రన్, ప్రతి వికెట్, ప్రతి పాయింట్ అత్యంత కీలకంగా మారాయి.

ఇది కూడా చదవండి: గంభీర్‌కు తలనొప్పిలా మారిన ముగ్గురు.. ప్రపంచకప్ బెర్త్ కోసం ఇలా కర్ఛీఫ్ వేశారేంటి..?

ఇవి కూడా చదవండి

టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం చేయాలి?

హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు సెమీఫైనల్ చేరాలంటే భవిష్యత్తు చాలా స్పష్టంగా ఉంది. భారత్ తన తదుపరి రెండు లీగ్ మ్యాచ్‌లలో బలమైన ఆస్ట్రేలియా, అలాగే బంగ్లాదేశ్‌లతో తలపడనుంది. ఈ రెండింటిలోనూ టీమిండియా ఖచ్చితంగా విజయం సాధించాల్సిందే. ఒక్క మ్యాచ్‌లో ఓడినా, భారత జట్టు సెమీస్ అవకాశాలు ఇతర జట్ల గెలుపోటములు, నెట్ రన్ రేట్‌పై ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి భారత మహిళలు ఒత్తిడిని అధిగమించి ఆడాల్సి ఉంది.

గ్రూప్-ఎ లో ఆసీస్, దక్షిణాఫ్రికా హవా..

ప్రస్తుతం గ్రూప్-ఎ లో ఆస్ట్రేలియా జట్టు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతోంది. తదుపరి ఆడబోయే భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లలో ఒక్కటి గెలిచినా ఆసీస్ సెమీస్ సీటు ఖాయమవుతుంది. మరోవైపు దక్షిణాఫ్రికా కూడా మూడు మ్యాచ్‌లలో రెండు గెలిచి రేసులో ఉంది. సౌతాఫ్రికా తన తదుపరి మ్యాచ్‌లలో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌లతో తలపడనుంది. బంగ్లాదేశ్ కూడా రెండు విజయాలతో రేసులో ఉన్నప్పటికీ, భారత్, దక్షిణాఫ్రికాల వంటి బలమైన జట్లను ఢీకొట్టాల్సి ఉండటంతో వారి బాట కష్టంగా మారింది.

ఇది కూడా చదవండి: IND vs ENG: ఈ ముగ్గురు ఏం తప్పు చేశారయ్యా.. తోపులా దూసుకెళ్తున్నా, ఛీ కొడుతున్న బీసీసీఐ సెలెక్టర్లు..?

గ్రూప్-బి లో ఇంగ్లాండ్, విండీస్ దూకుడు.. కివీస్, లంకకు కష్టాలే..!

ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌లూ గెలిచి గ్రూప్-బి లో టాప్‌లో ఉంది. న్యూజిలాండ్, వెస్టిండీస్‌లతో జరగబోయే మ్యాచ్‌లలో ఒక్కటి గెలిచినా ఇంగ్లాండ్‌కు తిరుగుండదు. వెస్టిండీస్ సైతం మూడు విజయాలతో రెండో స్థానంలో ఉంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో విండీస్ తలపడనుంది. అయితే డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్, ఆసియా కప్ విజేత శ్రీలంక జట్లు మూడు మ్యాచ్‌లలో రెండేసి ఓటములతో వెనుకబడ్డాయి. స్కాట్లాండ్ కూడా రేసులో ఉన్నప్పటికీ, ఈ మూడు జట్లలో ఏ ఒక్కటి తదుపరి మ్యాచ్ ఓడినా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us