WPL 2024: డబ్ల్యూటీసీ ఫైనల్ ఫైట్ ఉచితంగా చూడండి ఇలా.. పూర్తి వివరాలు మీకోసం..
WPL 2024 Final LIVE Streaming Details: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లీగ్ రౌండ్‌లో 8 మ్యాచ్‌లలో 6 గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా రెండోసారి ఫైనల్‌కు టిక్కెట్‌ను బుక్ చేసుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను 5 పరుగుల తేడాతో ఓడించిన ఆర్‌సీబీ తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది.
WPL 2024 Final LIVE Streaming Details: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (Women’s Premier League 2024 final) రెండవ సీజన్ చివరి దశకు చేరుకుంది. లీగ్ చివరి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Delhi Capitals vs Royal Challengers Bangalore) మధ్య జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ రౌండ్‌లో 8 మ్యాచ్‌లకు గాను 6 గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా రెండోసారి ఫైనల్స్‌కు టిక్కెట్‌ను బుక్ చేసుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను 5 పరుగుల తేడాతో ఓడించిన ఆర్‌సీబీ తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. గతసారి ఢిల్లీ క్యాపిటల్స్ ఛాంపియన్ కలను ముంబై ఇండియన్స్ చెడగొట్టింది. అందుకే ఢిల్లీ జట్టు కలను ఆర్సీబీ ఛేదించగలదా అన్నది రేపటితో తేలనుంది.
ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరగుతుందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య WPL ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య WPL ఫైనల్ మ్యాచ్ 17 మార్చి 2024న అంటే ఆదివారం జరుగుతుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య WPL ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య WPL ఫైనల్ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య WPL ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య WPL ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే WPL ఫైనల్ మ్యాచ్‌ను టీవీలో ప్రత్యక్షంగా చూడటం ఎలా?
స్పోర్ట్స్-18లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌ని చూడవచ్చు.
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే WPL ఫైనల్ మ్యాచ్‌ను మొబైల్‌లో ప్రత్యక్షంగా చూడటం ఎలా?
Jio సినిమాస్‌లో, వెబ్‌సైట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన WPL ఫైనల్ మ్యాచ్‌ని చూడవచ్చు.
ఇరు జట్లు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), మేఘన, ఇంద్రాణి రాయ్, రిచా ఘోష్, దిశా కసత్, శుభా సతీష్, సిమ్రాన్ బదూర్, నాడిన్ డి క్లెర్క్, సోఫీ డివైన్, రాంకా పాటిల్, ఎల్లిస్ పెర్రీ, ఏక్తా బిష్త్, కేట్ క్రాస్, సోఫీ మోలిద్దా పోకర్కర్, రేణుకా ఠాకూర్ సింగ్, జార్జియా, ఆశా శోభనా.
ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లానింగ్ (కెప్టెన్), తానియా భాటియా, జెమీమా రోడ్రిగ్జ్, షఫాలీ వర్మ, ఎలిస్ క్యాప్స్, మరిజన్ కప్ప్, శిఖా పాండే, అన్నాబెల్ సదర్లాండ్, జెస్ జాన్సన్, మిన్ను మణి, పూనమ్ యాదవ్, అరుంధతి రెడ్డి, టిటాస్ సాధు, రాధా యాదవ్, అశ్విని కుమారి , అపర్ణ మోండల్, స్నేహ దీప్తి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..