AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s IPL 2023: మహిళల ఐపీఎల్ జట్లు, ప్రసార హక్కుల వేలానికి రంగం సిద్ధం.. లిస్టులో చేరిన బడా కంపెనీలు..

రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఇప్పటికే WIPL జట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచాయి. నీతా అంబానీ గతంలో కూడా మహిళా క్రికెట్‌కు మద్దతుగా గళం విప్పారు.

Women's IPL 2023: మహిళల ఐపీఎల్ జట్లు, ప్రసార హక్కుల వేలానికి రంగం సిద్ధం.. లిస్టులో చేరిన బడా కంపెనీలు..
Womens Ipl 2023
Venkata Chari
|

Updated on: May 11, 2022 | 5:18 PM

Share

మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను వేలం వేస్తే భారీగా డబ్బు వస్తుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అంచనా వేస్తోంది. 2022 చివరి నాటికి బీసీసీఐ టెండర్‌ను విడుదల చేయనుంది. బోర్డు నుంచి WIPL (ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్) హక్కులను కొనుగోలు చేయడానికి అనేక బ్రాండ్లు ఆసక్తిని కనబరుస్తున్నాయని BCCI కార్యదర్శి జైషా బ్లూమ్‌బెర్గ్‌తో పేర్కొన్నారు. BCCI మహిళల క్రికెట్ లీగ్‌ను ఆరు లీగ్ జట్లతో ప్రారంభించనుంది. ఈ మేరకు మ్యాచ్‌ల ప్రసార హక్కులను వచ్చే ఏడాది ప్రారంభంలో వేలం వేయాలనుకుంటోంది. ఇప్పటికే ఉన్న IPL ఫ్రాంచైజీలు మహిళల IPL జట్లతోనే వేలం వేయాలని జైషా భావిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఇప్పటికే WIPL జట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచాయి. నీతా అంబానీ గతంలో కూడా మహిళా క్రికెట్‌కు మద్దతుగా గళం విప్పారు. బీసీసీఐ నిర్వహించిన మహిళల టీ20 ఛాలెంజ్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను జియో కొనుగోలు చేసింది.

Also Read: 180 సిక్సర్లు.. 3005 పరుగులు.. బౌలర్లను దంచేసిన బ్యాటర్.. కట్ చేస్తే.. ఆ జట్టు నుంచి తప్పించారు..

ఆరు జట్ల మహిళల ఐపీఎల్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. బీసీసీఐ దాని కోసం బ్లూప్రింట్‌ను సిద్ధం చేస్తోంది. అయితే, ఇది IPL 2023 నుంచి ప్రత్యేక విండోలో జరుగుతుంది. ఐపీఎల్ మీడియా హక్కుల కోసం బీసీసీఐ ఇప్పటికే టెండర్లు వేసింది. టెండర్ పత్రాల స్వీకరణకు చివరి తేదీ మే 10తో ముగిసింది.

క్రికెట్ లీగ్‌లో వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి షా గేమ్ ప్లాన్ కొత్త రకమైన ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నాడు. 15 ఏళ్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి మరింత లాభం పొందేందుకు వివిధ మార్గాల్లో కృషి చేస్తున్నాడు. BCCI అంచనాల ప్రకారం, IPL గత సంవత్సరం 600 మిలియన్ల మంది వీక్షకులను ఆకర్షించింది. వీక్షకుల పరంగా ప్రీమియర్ లీగ్, నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ కంటే వెనుకంజలోనే నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ ప్రసార హక్కుల వేలం జూన్‌లో జరగనుంది. ముంబైలోని బెక్స్లీ అడ్వైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఉత్కర్ష్ సిన్హా మాట్లాడుతూ, భారత మిత్రదేశాల మధ్య క్రికెట్ ఆడటం కొనసాగినంత కాలం, ఐపీఎల్‌కు ఆదరణ పెరుగుతూనే ఉంటుందని తెలిపాడు.

ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో మహిళల లీగ్‌లు..

ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో ప్రొఫెషనల్ మహిళల క్రికెట్ లీగ్‌లు ఆడుతున్నారు. మహిళల బిగ్ బాష్ లీగ్ ఆస్ట్రేలియాలో, ది హండ్రెడ్‌ ఇంగ్లాండ్‌లో నిర్వహిస్తున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా మహిళల లీగ్‌ను ప్రారంభించే ప్రణాళికలపై కసరత్తు చేస్తున్నాయి.

ఇప్పటి వరకు ఉమెన్స్ ఐపీఎల్ పేరుతో పోటీలు నిర్వహించలేదు. కానీ, మహిళల టీ20 ఛాలెంజర్స్ పేరుతో టోర్నీ నిర్వహిస్తున్నారు. ఇది 2018 సంవత్సరం నుంచి ప్రారంభమైంది. ప్రారంభంలో 2 జట్లు పాల్గొని 1 మ్యాచ్ మాత్రమే ఆడాయి. ఆ మ్యాచ్‌లో సూపర్‌నోవాస్‌ విజయం సాధించింది.

మహిళల T20 ఛాలెంజ్‌లో గత ఏడాది విజేతలు ట్రైల్‌బ్లేజర్స్..

2019 నుంచి 3 జట్లు పాల్గొనడం ప్రారంభించాయి. 2019లో ఫైనల్‌తో సహా నాలుగు మ్యాచ్‌లు ఆడారు. వెలాసిటీని ఓడించి సూపర్‌నోవాస్ టైటిల్‌ను గెలుచుకుంది. ట్రైల్‌బ్లేజర్స్ 2020లో టైటిల్‌ను గెలుచుకుంది. అదే సమయంలో 2020లో ఫైనల్‌లో సూపర్‌నోవాస్ ఓడిపోయింది. ట్రైల్‌బ్లేజర్స్ జట్టు విజేతగా నిలిచింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: IPL 2022: ఏం ఆట ఆడుతున్నారు.. లక్నో ఆటగాళ్లపై మెంటర్‌ గౌతమ్ గంభీర్‌ ఆగ్రహం.. వీడియో వైరల్‌..

180 సిక్సర్లు.. 3005 పరుగులు.. బౌలర్లను దంచేసిన బ్యాటర్.. కట్ చేస్తే.. ఆ జట్టు నుంచి తప్పించారు..