IPL 2022: 12 ఇన్నింగ్స్‌లు.. 200 స్ట్రైక్ రేట్‌తో పరుగులు.. రీ ఎంట్రీపై కన్నేసిన ఆ భారత ఆటగాడు.. పంత్ ప్లేస్‌ ఢమాల్?

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఈ ప్లేయర్ జట్టులో ఉండాలని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో నిత్యం డిమాండ్ చేస్తున్నారు. 2004లో టీమ్ ఇండియా తరపున అరంగేట్రం చేసిన..

IPL 2022: 12 ఇన్నింగ్స్‌లు.. 200 స్ట్రైక్ రేట్‌తో పరుగులు.. రీ ఎంట్రీపై కన్నేసిన ఆ భారత ఆటగాడు.. పంత్ ప్లేస్‌ ఢమాల్?
D Karthik Vs Rishab Pant
Follow us
Venkata Chari

|

Updated on: May 11, 2022 | 5:29 PM

Dinesh Karthik vs Rishabh Pant: ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా అన్ని టీంల మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. ఇక కొంతమంది ప్లేయర్ల మధ్య కూడా తీవ్రమైన పోటీ నెలకొంది. టీమిండియా(Team India) ఆటగాళ్ల గురించి మాట్లాడితే, ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్‌లో చోటు కోసం అంతా తెగ కష్టపడుతున్నారు. కొంతమంది రాణిస్తుంటే, మరికొంతమంది మాత్రం అంచనాలను అందుకోలేక చతికిల పడుతున్నారు. ఈ లిస్టులో ఎంతో మంది యువ ప్లేయర్లతోపాటు సీనియర్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా దినేష్ కార్తీక్(Dinesh Karthik) గురించి ప్రస్తుతం ఎంతో ఆసక్తికరమైన వాతావరణం నడుస్తోంది. 12 ఇన్నింగ్స్‌లలో 200 స్ట్రైక్ రేట్, 68 సగటుతో 274 పరుగులు చేసిన దినేష్ కార్తీక్.. ఐపీఎల్ 2022లో అద్భుతంగా ఆడుతున్నాడు. 36 ఏళ్ల డీకే రాణించడంతో.. ప్రస్తుతం టీమ్ ఇండియాలో రిషబ్ పంత్ స్థానం ప్రమాదంలో పడినట్లేనని మాజీలు అంటున్నారు.

IPL 2022లో డెత్ ఓవర్ల సమయంలో అనుభవజ్ఞులైన బౌలర్లను ఎదుర్కొని డీకే బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో అతను టీ20 ప్రపంచ కప్ ఆడాలని భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో ప్రస్తుత ప్రదర్శన ఆధారంగా, రిషబ్ పంత్ కంటే దినేష్ కార్తీక్‌కు ప్రాధాన్యత ఇవ్వాలంటూ సూచనలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా రిషబ్ పంత్.. ప్రతీ మ్యాచ్‌లో నిరాశపరుస్తున్నాడు.

RCB ప్రతి విజయంలో కీలకంగా దినేష్ కార్తీక్ ..

ఇవి కూడా చదవండి

ఇక్కడ కేవలం వేగంగా బ్యాటింగ్ చేయడం, కొన్ని పరుగులు జోడించడం మాత్రమే కాదు.. RCBకి అన్ని విజయాల్లో దినేష్ కార్తీక్ అజేయంగా నిలిచాడు. ఈ నాటౌట్ ఇన్నింగ్స్‌లలో అతను 202 స్ట్రైక్ రేట్‌తో 200 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ బలమైన బౌలింగ్ దాడిలోనూ అద్భుతంగా ఆడాడు. ఎస్‌ఆర్‌హెచ్‌కు వ్యతిరేకంగా ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ కేవలం 8 బంతుల్లో అజేయంగా 30 పరుగులు చేశాడు.

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో దినేష్ జట్టులో ఉండాలని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో నిత్యం డిమాండ్ చేస్తున్నారు. 2004లో టీమ్ ఇండియా తరపున అరంగేట్రం చేసిన దినేష్ కార్తీక్.. అనేకసార్లు జట్టులోకి వస్తూ, పోతూ ఉన్నాడు.

పంత్‌ బ్యాట్‌ నుంచి మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ మిస్..

ఒకవైపు దినేష్‌ కార్తీక్‌ తన స్థిరమైన ఆటతీరుతో వరల్డ్‌ కప్‌ జట్టులో చోటు దక్కించుకోవాలని గట్టిగా వాదిస్తూంటే, రిషబ్‌ పంత్‌ బ్యాట్‌ మాత్రం అతడికి కోపం తెప్పించినట్లుంది. బ్యాటింగ్‌లో అతను విఫలం కావడంతో.. పలు వివాదాల్లోనూ తలదూర్చుతున్నాడు. టాప్ ఆర్డర్‌లో ఆడే పంత్ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు పంత్ ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయకపోవడం గమనార్హం.

రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ నో బాల్ ఇవ్వకపోతే వెనక్కి రావాలని పంత్ తన బ్యాట్స్‌మెన్‌కు సంకేతాలు ఇచ్చిన తీరు అతని ఇమేజ్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. ఐపీఎల్ 15 గ్రూప్ స్టేజ్‌లో మిగిలిన 3 మ్యాచ్‌లలో పంత్ తన పూర్వ ఫాం అందుకోలేకపోతే, టీ20 ప్రపంచకప్‌లో అతని ఎంపిక ప్రశ్నార్థకంగా మారే ఛాన్స్ ఉంది.

ఫినిషర్ పాత్రను పోషిస్తున్న కార్తీక్..

36 ఏళ్ల దినేష్ కార్తీక్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఫినిషర్ పాత్ర లభించింది. ఇందుకోసం డీకే కూడా కంటిన్యూగా ప్రాక్టీస్ చేయడం చూశాం. పోటీలో కనీసం 100 పరుగులు చేసిన ఆటగాళ్లలో, దినేష్ కార్తీక్ అత్యధిక స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నాడు. DK ఈ సీజన్‌లో 200 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధిస్తున్నాడు. అతని బ్యాట్ 21 సిక్సర్లు కొట్టింది. ఇది IPL 15లో నాల్గవ అత్యధికంగా నిలిచింది. కాగా, మూడు మ్యాచ్‌ల్లో పరుగులు రాకపోవడంతో బెంగళూరు హ్యాట్రిక్‌ ఓటమిని చవిచూడాల్సి వచ్చిందంటే దినేశ్‌ కార్తీక్‌ ఫామ్‌కు ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. CSK, SRHతో జరిగిన మ్యాచ్‌లలో బెంగళూరు విజయాలు నమోదు చేయడంతో అతను గత రెండు మ్యాచ్‌లలో పరుగులు చేశాడు. బెంగళూరు ప్లేఆఫ్స్‌ను అధిగమించాలంటే డీకే పాత్ర చాలా కీలకం కానుంది.

దినేష్ కార్తీక్ అంతర్జాతీయ అరంగేట్రం చేసి 18 ఏళ్లు పూర్తయ్యాయి. మహేంద్ర సింగ్ ధోనీ ఉండగా అతనికి ఎక్కువ కాలం జట్టులో ఆడే అవకాశం రాలేదు. 2019 వన్డే ప్రపంచకప్‌లో 25 బంతులు ఆడి 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ వైఫల్యం అతని కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం ఐపీఎల్ 15లో పటిష్ట ఆటతీరును బట్టి చూస్తే టీమిండియాలోకి పునరాగమనం చేయాలన్న అతడి కల త్వరలో నెరవేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Women’s IPL 2023: మహిళల ఐపీఎల్ జట్లు, ప్రసార హక్కుల వేలానికి రంగం సిద్ధం.. లిస్టులో చేరిన బడా కంపెనీలు..

IPL 2022: ఏం ఆట ఆడుతున్నారు.. లక్నో ఆటగాళ్లపై మెంటర్‌ గౌతమ్ గంభీర్‌ ఆగ్రహం.. వీడియో వైరల్‌..