WI vs IND: ‘171 రన్స్‌తో నిరాశపరిచినా, సుదీర్ఘకాలం రాణించగలడు’.. యువ సంచలనంపై స్పిన్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు..
Harbhajan Singh on Yashasvi Jaiswal: భారత్, వెస్టిండీస్ మధ్య డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. భారత్ తరఫున యశస్వీ జైస్వాల్ ఆరంగేట్ర మ్యాచ్‌లోనే 171 పరుగులతో చెలరేగగా, కెప్టెన్ రోహిత్ శర్మ 103 రన్స్‌తో..
Harbhajan Singh on Yashasvi Jaiswal: భారత్, వెస్టిండీస్ మధ్య డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. భారత్ తరఫున యశస్వీ జైస్వాల్ ఆరంగేట్ర మ్యాచ్‌లోనే 171 పరుగులతో చెలరేగగా, కెప్టెన్ రోహిత్ శర్మ 103 రన్స్‌తో శతకం సాధించాడు. బౌలింగ్‌లోనూ టీమిండియా తరఫున అశ్విన్ 12, జడేజా 5 వికెట్లు తీసుకున్నారు. అయితే ఇప్పుడు అందరి నోట యశస్వీ ఆరంగేట్ర ప్రదర్శన గురించే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే యశస్వీపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యశస్వీ తొలి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడని, కానీ భారత్ తరఫున సుదీర్ఘకాలం పాటు రాణించగలడని భజ్జీ చెప్పుకొచ్చాడు.
హర్భజన్ టర్బనేటర్ సింగ్ అనే తన యూట్యూబ్ చానల్‌లో మాట్లాడిన భజ్జీ ‘యశస్వి జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన తొలి మ్యాచ్‌లోనే తనదైనా మార్క్ వేసుకున్నాడు. ఆరంగేట్ర మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీని కోల్పోయాడని నిరాశ చెందినా, అతను సుదీర్ఘకాలం పాటు భారత్ కోసం ఆడగలడిన నేను భావిస్తున్నా. అతనిలో ప్రతిభకు లోటు లేదు. యువ జైస్వాల్‌కి నా నుంచి సలహా ఏమిటంటే, సామర్థ్యం మేరకు కష్టపడి పని చేయడమే’నని చెప్పుకొచ్చాడు.
అలాగే కెప్టెన్ రోహిత్ ప్రదర్శన గురించి కూడా మాట్లాడుతూ ‘రోహిత్ 2, 3 ఏళ్లుగా భారీ స్కోర్ చేయలేదనే చర్చ జరిగింది. కానీ ఈ మ్యాచ్‌లో అతను 103 పరుగులతో రాణించి సెంచరీ చేసినందుకు రోహిత్‌కి అభినందనలు. విరాట్ కోహ్లీ కూడా 76 పరుగులతో మెరుగ్గా రాణించాడు. కానీ దాన్ని సెంచరీగా మరల్చి అభిమానులను సంతోషపెట్టలేకపోయాడు. ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంకా ఈ మ్యాచ్ 3 రోజుల్లోనే ముగిసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..