SRH vs KKR IPL 2022 Match Prediction: ఈ మ్యాచ్ ఇరు జట్లకి కీలకం.. ప్లే ఆఫ్ రేసులో ఎవరు నిలుస్తారో..!
SRH vs KKR IPL 2022 Match Prediction: ఐపీఎల్‌లో 2022లో భాగంగా శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది.
SRH vs KKR IPL 2022 Match Prediction: ఐపీఎల్‌లో 2022లో భాగంగా శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకి చాలా కీలకం. ప్లే ఆఫ్ రేసులో ఎవరు నిలుస్తారో ఈ మ్యాచ్‌ని బట్టి తెలుస్తోంది. రెండు జట్లు ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే పాయింట్లు మాత్రమే కాదు రన్ రేట్ కూడా అవసరం. అంటే రెండు జట్లూ అంచనాలను అందుకోవాలంటే చాలా మంచి ప్రదర్శన కనబరచాలి. ముఖ్యంగా కోల్‌కతా (కేకేఆర్) ఓడిపోతే టోర్నిలో వారి కథ ముగిసినట్లే. ఈ సీజన్‌లో ఇరు జట్లు తలపడడం ఇది రెండోసారి. అంతకుముందు ఏప్రిల్ 15న ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఇరు జట్లు తలపడ్డాయి. అప్పుడు కోల్‌కతా 175 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 7 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది.
ఐపీఎల్‌లో ఇరు జట్లు ఢీకొన్న చరిత్రను చూస్తే కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లు ఇప్పటి వరకు 22 మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో కేకేఆర్ 14 గెలుపొందగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. చివరి 5 మ్యాచ్‌లని పరిశీలిస్తే కోల్‌కతా నైట్ రైడర్స్ 4 మ్యాచ్‌లు గెలవగా, సన్‌రైజర్స్ 1 మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. చరిత్ర చూస్తే కోల్‌కతా నైట్ రైడర్సే ఎక్కువ విజయాలు సాధించింది. కానీ ప్రస్తుత పరిస్థితిలో సన్‌రైజర్స్ పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. కేకేఆర్ జట్టులో పాట్ కమిన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అదే సమయంలో కోల్‌కతా బ్యాటింగ్ కూడా పేలవంగా ఉంది. మరోవైపు కోల్‌కతా కంటే సన్‌రైజర్స్ జట్టు కాస్త బలంగానే కనిపిస్తోంది. ఐపీఎల్ 2022 పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 11 మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లు సాధించింది. అదే సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా 10 పాయింట్లను కలిగి ఉంది అయితే వారు సన్‌రైజర్స్ కంటే ఒక మ్యాచ్ ఎక్కువ ఆడారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి