Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 3rd Test Preview: జోరుమీదున్న టీమిండియా.. గెలిచేందుకు ఇంగ్లండ్ ఆరాటం.. నేటినుంచి హెడింగ్లీలో మూడో టెస్టు

India vs England 3rd Test Prediction: టీమిండియా మాంచి జోష్‌లో ఉంది. తొలి టెస్టులో గెలుపు అంచుల దాకా వచ్చినా.. వర్షం అడ్డంకితో డ్రాగా ముగిసింది. ఇక రెండో టెస్టులో జోరు చూపించి 1-0 ఆధిక్యంలోకి చేరింది. ఈ మ్యాచులోనూ గెలిచి తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని భావిస్తోంది.

IND vs ENG 3rd Test Preview: జోరుమీదున్న టీమిండియా.. గెలిచేందుకు ఇంగ్లండ్ ఆరాటం.. నేటినుంచి హెడింగ్లీలో మూడో టెస్టు
Ind Vs Eng 3rd Test
Follow us
Venkata Chari

|

Updated on: Aug 25, 2021 | 11:28 AM

India vs England 3rd Test: హెడింగ్లీలో భారత్ , ఇంగ్లండ్ టీంల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ నాటింగ్‌హామ్‌లో వర్షంతో డ్రాగా ముగిసింది. అలాగే రెండో టెస్టు లార్డ్స్‌లో ఫలితం తేలింది. ఇందులో టీమిండియా 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. ప్రస్తుతం మూడోవ టెస్టు మ్యాచ్ నేడు(బుధవారం, 25 నుంచి) హెడింగ్లీలో జరగనుంది. ఈ మ్యాచులో గెలచి టీమిండియా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని కోరుకుంటుంది. “ప్రపంచంలోని ఏ జట్టునైనా ఓడించగలమని మాకు ఖచ్చితంగా తెలుసు. ఇంగ్లండ్‌పై వెనుకడుగు వేసే ప్రశ్నే లేదు. ఎందుకంటే మేము ఎల్లప్పుడూ గెలించేందుకే ఆడతాం” అంటూ విరాట్ కోహ్లీ మూడవ టెస్టు మ్యాచ్‌కు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. జోరు మీదున్న టీమిండియాను ఆపడం ఇంగ్లండ్ టీంకు సవాలుగా మారనుంది. హెడింగ్లీలో విజయం సాధించాలంటే ఇంగ్లండ్ అన్ని రంగాల్లో ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.

హెడింగ్లీ మైదానంలో టీమిండియా వరుస మ్యాచుల్లో గెలవడంతో ఇంగ్లండ్‌కు భయం పట్టుకుంది. హెడింగ్లీలో విజయం సాధిస్తే.. సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉండనుంది. అదే సమయంలో, భారత్ ఈ మైదానంలో హ్యాట్రిక్ విజయం సాధిస్తుంది. ఇంతకుముందు, హెడింగ్లీలో 1986, 2002లో ఆడిన రెండు వరుస మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించింది. ఈ మైదానంలో టీమిండియాకు ఇది 7 వ మ్యాచ్ అవుతుంది. ఇంతకుముందు ఇక్కడ జరిగిన చివరి 6 మ్యాచ్‌లలో, ఇండియా 2 మ్యాచుల్లో, ఇంగ్లండ్ 3 మ్యాచుల్లో గెలిచింది. 1 టెస్ట్ డ్రాగా ముగిసింది. 7 వ టెస్టులో భారత్ హెడింగ్లీలో విజయం సాధిస్తే.. రెండు జట్ల స్కోరు 3-3కి సమంగా నిలవనున్నాయి.

పిచ్, వాతావరణం: మైదానంలో పచ్చదనం చాలా తక్కువగా ఉంది. దీంతో టీంలో కొన్ని మార్పులు జరగొచ్చని తెలుస్తోంది. కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ, “పిచ్‌ను చూసి ఆశ్చర్యపోయాం. దానిపై చాలా తక్కువ గడ్డి ఉంది. దీంతో జట్టు ఎంపికలో మార్పులు ఉండొచ్చు. ” అని తెలిపాడు. వర్షం వచ్చే సూచనలు ఉండడంతో తొలి టెస్టు మ్యాచ్ ఫలితమే వస్తుందేమోనని అభిమానులు భయపడుతున్నారు.

హెడింగ్లీలో 54 ఏళ్లుగా ఓటమి ఎరుగని భారత్.. గత 54 సంవత్సరాలుగా టీమిండియా హెడింగ్లీలో ఓడిపోలేదు. 1967లో ఇక్కడ చివరి మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ప్రస్తుత టీమిండియా కూడా అదే దూకుడితో విజయాల రికార్డును అలానే ఉంచాలని కోరుకుంటోంది.

స్టాట్స్: రూట్ ఈ ఏడాది 10 టెస్టుల్లో 1277 పరుగులు చేశాడు. అతని సమీప ప్రత్యర్థి రోహిత్ శర్మ (690) కంటే దాదాపు రెండు రెట్లు, అతని తదుపరి ఉత్తమ సహచరుడు రోరీ బర్న్స(363) కంటే నాలుగు రెట్లు ఎక్కువగా పరుగులు సాధించాడు.

టీంల వివరాలు: ఇంగ్లండ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకునేందుకు క్రెయిగ్ ఓవర్టన్, సాకీబ్ మహమూద్‌ల మధ్య పోటీ నెలకొంది. క్రెయిగ్ ఓవర్టన్.. చాలా ఓవర్లు బౌలింగ్ చేయగలడు. అలాగే బాగా బ్యాటింగ్ చేయగల సత్తా చాటాడు. మరో ప్లేయర్ సాకీబ్ మహమూద్ – అద్భుతంగా బౌలింగ్ చేయడంలో దిట్ట. వీరిలో ఒకరు ఇంగ్లండ్ ఎలెవన్‌లో చోటు దక్కే ఛాన్స్ ఉంది.

ఇంగ్లండ్ టీం (అంచనా): రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, దావీద్ మలన్, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్ (కీపర్), మోయిన్ అలీ, సామ్ కర్రాన్, ఒల్లీ రాబిన్సన్, క్రెయిగ్ ఓవర్టన్ /సకిబ్ మహమూద్, జేమ్స్ ఆండర్సన్

లార్డ్స్‌లో గెలిచిన టీంతోనే బరిలోకి దిగే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అలాగే ఈ ఆటగాళ్లందరూ ఎలాంటి గాయాల బారిన పడకపోవడంతో టీం కూడా సంతోషంగానే ఉంది. కానీ, లీడ్స్‌లోని పిచ్ చాలా నెమ్మదిగా ఉంటుందని భావిస్తున్నారు. హనుమ విహారికి ఈ మ్యాచులో ఆడే అవకాశం దక్కనున్నట్లు సమచారం. పుజారా స్థానంలో అతను ఆడే అవకాశం ఉంది.

టీమిండియా (అంచనా): కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, హనుమ విహారి/ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

Also Read: మద్యం సేవించి బ్యాటింగ్ చేశాడు.. అదరగొట్టే సెంచరీతో అజేయంగా నిలిచాడు.. చరిత్ర సృష్టించాడు..

ఆ మ్యాచ్‌లో బుమ్రా అదరగొట్టాడు.. 7 పరుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించాడు.. భారత్‌కి బలమైన విజయాన్ని అందించాడు..