AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ మ్యాచ్‌లో బుమ్రా అదరగొట్టాడు.. 7 పరుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించాడు.. భారత్‌కి బలమైన విజయాన్ని అందించాడు..

Jasprit bumrah: జస్ప్రీత్ బుమ్రా తక్కువ సమయంలోనే టీమిండియాలో కీలక బౌలర్‌గా ఎదిగాడు. కెరీర్‌లో చాలా మ్యాచ్‌లలో

ఆ మ్యాచ్‌లో బుమ్రా అదరగొట్టాడు.. 7 పరుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించాడు.. భారత్‌కి బలమైన విజయాన్ని అందించాడు..
Bumrah
Follow us
uppula Raju

|

Updated on: Aug 25, 2021 | 9:45 AM

Jasprit bumrah: జస్ప్రీత్ బుమ్రా తక్కువ సమయంలోనే టీమిండియాలో కీలక బౌలర్‌గా ఎదిగాడు. కెరీర్‌లో చాలా మ్యాచ్‌లలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేవలం 22 టెస్టుల్లోనే 95 వికెట్లు సాధించాడు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. అదే సమయంలో నాటింగ్‌హామ్‌లో డ్రా అయిన మొదటి టెస్టులో అతను మొత్తం 9 వికెట్లు తీసుకున్నాడు. అయితే తను సాధించిన ఒక రికార్డ్ మాత్రం మళ్లీ రిపీట్‌ చేయలేకపోతున్నాడు. బుమ్రా ఒక మ్యాచ్‌లో 7 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టడమే కాకుండా టీమిండియాకు బలమైన విజయాన్ని అందించాడు. అయితే బుమ్రా సరిగ్గా ఇదే రోజున ( ఆగస్టు 25) ఈ ప్రదర్శన చేయడం విశేషం.

2019 సంవత్సరంలో భారత జట్టు వెస్టిండీస్‌లో పర్యటించింది. ఈ పర్యటనలో ఆగస్టు 22 నుంచి 25 వరకు ఆంటిగ్వాలో ఇరు జట్ల మధ్య మొదటి టెస్ట్ జరిగింది. ఇందులో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి 297 పరుగులు చేసింది. అజింక్య రహానే 81 పరుగులు, రవీంద్ర జడేజా 58, కెఎల్ రాహుల్ 44 పరుగులు చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఘోరంగా ఫ్లాప్ అయ్యారు. విండీస్ తరఫున కెమర్ రోచ్ 4, షానన్ గాబ్రియేల్ మూడు వికెట్లు తీశారు. ప్రత్యుత్తరంగా ఆతిథ్య జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌట్ అయింది. రోస్టన్ చేజ్ 48 పరుగులు, కెప్టెన్ జాసన్ హోల్డర్ 39 పరుగులు చేయగా భారతదేశం అత్యంత విజయవంతమైన బౌలర్ ఇషాంత్ శర్మ ఐదు వికెట్లు తీశాడు.

బుమ్రా 8 ఓవర్లలో 7 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు.. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 343 పరుగులకు డిక్లేర్ చేసింది. రహానే ఈసారి సెంచరీ పూర్తి చేసి 102 పరుగులు చేశాడు. మరోవైపు, హనుమ విహారి కేవలం ఏడు పరుగుల తేడాతో సెంచరీ మిస్సయ్యాడు 93 పరుగులకే పెవిలియన్‌కు వచ్చాడు. కెప్టెన్ కోహ్లీ 51 పరుగులు చేయగా, కెఎల్ రాహుల్ 38 పరుగులు చేశాడు. విండీస్ తరఫున రోస్టన్ చేజ్ నాలుగు వికెట్లు తీశాడు. 419 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ని బుమ్రా దారుణంగా దెబ్బతీశాడు. జస్ప్రీత్ 8 ఓవర్లలో 7 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఇషాంత్‌ శర్మ మూడు వికెట్లు సాధించాడు.

Royal Enfield: వచ్చేస్తుంది.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కొత్త క్లాసిక్‌ 350.. సెప్టెంబర్‌ 1న లాంచ్‌.. ధర ఎంతో తెలుసా..?

Viral Video: ఇవేంటిరా ఇంత శ్రద్ధగా దాడి చేశాయి..అతడు సినిమా డైలాగ్‌ను గుర్తు చేసిన మొసలి.. ఇది చూసిన నెటిజన్లు షాక్..

Samantha: తనను తాను సిండ్రెల్లాతో పోల్చుకున్న సమంత… ఇంట్రెస్టింగ్‌ ఫొటోతో ఆసక్తికరమైన క్యాప్షన్‌..