19 ఏళ్ల వయసులోనే 20 సిక్సర్లు.. 30 ఫోర్లు బాదాడు..! అతడి ధాటికి బౌలర్లు విలవిలలాడిపోయారు..

Cricket News: మీరు క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి డేంజర్‌ బ్యాట్స్‌మెన్లను చూసి ఉంటారు కానీ ఈ 19 ఏళ్ల అనుభవం

19 ఏళ్ల వయసులోనే 20 సిక్సర్లు.. 30 ఫోర్లు బాదాడు..! అతడి ధాటికి బౌలర్లు విలవిలలాడిపోయారు..
Symonds
Follow us

|

Updated on: Aug 25, 2021 | 11:54 AM

Cricket News: మీరు క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి డేంజర్‌ బ్యాట్స్‌మెన్లను చూసి ఉంటారు కానీ ఈ 19 ఏళ్ల అనుభవం లేని ఆటగాడి విధ్యంసం చూస్తే షాక్ అవుతారు. ఈ బలమైన యువ కుడి చేతి క్రికెటర్ 20 సిక్సర్లు, 40 ఫోర్లతో 330 పరుగుల చారిత్రాత్మక ఇన్నింగ్స్‌ ఆడాడు. సరిగ్గా ఇదే రోజు అంటే 1995, ఆగస్టు 25న ఈ మ్యాచ్‌ జరిగింది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఆటగాడి పేరు ఆండ్రూ సైమండ్స్. అప్పుడు అతడి వయసు కేవలం19 సంవత్సరాలు మాత్రమే.

వాస్తవానికి ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్ లెజెండరీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఈ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో సైమండ్స్ మొదటి ఇన్నింగ్స్‌లో 254 నాటౌట్, రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగులు సహా మొత్తం 330 పరుగులు సాధించాడు. మొదటగా బ్యాటింగ్‌ చేసిన గ్లామోర్గాన్ 334 పరుగులు చేశాడు. ఇందులో డారెన్ థామస్ అజేయంగా 78, డేవిడ్ హెంప్ 71, కెప్టెన్ హెచ్.మోరిస్ 67 పరుగులు చేశారు. 50 అదనపు పరుగులు వచ్చాయి. గ్లౌసెస్టర్‌షైర్ తరఫున జవగల్ శ్రీనాథ్, మార్టిన్ బాల్ చెరో నాలుగు వికెట్లు తీశారు. ప్రత్యుత్తరంగా, గ్లౌసెస్టర్‌షైర్ 461 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్‌ను ముగించింది. ఆండ్రూ సైమండ్స్ 206 బంతుల్లో 16 సిక్సర్లు, 22 ఫోర్లతో అజేయంగా 254 పరుగులు చేశాడు. అతనితో పాటు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిచర్డ్ విలియమ్స్ 52 పరుగులు చేశాడు. శ్రీనాథ్ 39 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. గ్లామోర్గాన్ తరపున స్టీవ్ వాట్కిన్, రాబర్ట్ క్రాఫ్ట్ మూడేసి వికెట్లు సాధించారు.

జవగల్ శ్రీనాథ్ ఒక ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లు గ్లామోర్గాన్ తన రెండో ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. ఈసారి ఇద్దరు బ్యాట్స్‌మన్‌లు జట్టు కోసం సెంచరీలు సాధించారు. మాథ్యూ మేనార్డ్ 164 పరుగులు, డేవిడ్ హెంప్ 157 పరుగులు చేశారు. ఇవి కాకుండా కెప్టెన్ హెచ్. మారిస్ 62 పరుగులు అందించారు. జవగల్ శ్రీనాథ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు 21 ఓవర్లలో 76 పరుగుల ఇచ్చి తొమ్మిది వికెట్లు సాధించాడు. అతను ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టే రికార్డ్ త్రుటిలో కోల్పోయాడు. గ్లామోర్గాన్ 345 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మ్యాచ్ ముగిసే వరకు జట్టు తొమ్మిది వికెట్లకు 293 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈసారి గ్లౌస్టర్‌షైర్ తరఫున ఆండ్రూ సైమండ్స్ అత్యధికంగా 76 పరుగులు చేశాడు. 65 బంతుల్లో 8 ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టాడు. అతనితో పాటు కెప్టెన్ మార్క్ అలెన్ 64 పరుగులు, మోంటే లించ్ నాటౌట్ 56 పరుగులు చేశారు.

ఆఫ్ఘన్ నుంచి ఢిల్లీ చేరిన 78 మందిలో 16 మందికి కోవిడ్ పాజిటివ్..అంతా క్వారంటైన్ కి !

Salman khan: సల్మాన్‌ ఖాన్‌ని అడ్డుకోవడంలో తప్పులేదు..! అతడు తన బాధ్యతను మాత్రమే నిర్వహించాడు..

Priyamani: తల్లి పాత్రలు చేసినా.. అందంలో ఎవరు తనకు పోటీ రారంటున్న గ్లామర్ క్వీన్‌..

Latest Articles